సినిమా రిలీజ్ రోజు దానికి హైప్ పెంచడానికి సీక్వెల్ తీయబోతున్నామని.. ఇతర భాషల్లోకి రీమేక్ కాబోతోందని ప్రకటనలు ఇవ్వడం మామూలే. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇలాంటి గిమ్మిక్కులు ప్లే చేస్తుంటారు. కానీ తర్వాత చూస్తే అలాంటిదేమీ ఉండదు. కొన్ని సినిమాల మేకర్స్ మాటలు మాత్రమే నిజమవుతుంటాయి. మరి శుక్రవారం రిలీజైన కొత్త సినిమా ‘ప్లే బ్యాక్’ టీం చేసిన అనౌన్స్‌మెంట్ సంగతేంటో తెలియదు. సుకుమార్ మిత్రుడైన హరిప్రసాద్ జక్కా రూపొందించిన చిత్రమిది.
ఇంతకుముందు ఆయన సుకుమార్ అన్న కొడుకు అశోక్‌ను హీరోగా పెట్టి ‘దర్శకుడు’ అనే సినిమా తీశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘ప్లే బ్యాక్’ తీశాడు. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. 1993 కాలంలో ఉన్న అమ్మాయి.. 2019లో ఉన్న అబ్బాయికి ఫోన్ ద్వారా లైన్ కలిపితే ఎలా ఉంటుందన్న కథతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ తరహా సినిమాలను ‘క్రాస్ టైం టెలిఫోన్ కాన్వర్జేషన్’ జానర్‌గా పరిగణిస్తారు. ఇండియాలో ఈ జానర్లో తెరకెక్కిన తొలి చిత్రంగా ‘ప్లే బ్యాక్’ను చిత్ర బృందం ప్రచారం చేసుకుంది. ఐతే మనకు ఈ జానర్ కొత్త కానీ.. విదేశాల్లో ఇది బాగా పాపులర్. కొరియాలో వందలకొద్దీ ఈ జానర్లో సినిమాలు రావడం విశేషం. హాలీవుడ్‌నూ ఆ టైపు సినిమాలున్నాయి. నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న జర్మన్ సిరీస్ ‘డార్క్’ కూడా ఈ జానర్లో తెరకెక్కిందే. ‘ప్లే బ్యాక్’కు ‘డార్క్’ సిరీసే స్ఫూర్తి అని.. దానికిది కాపీ అని కూడా అంటున్నారు.
ఐతే కాన్సెప్ట్ అయితే తెలుగు ప్రేక్షకులకు కొత్త కావడంతో కొంత మేర ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సినిమా పర్వాలేదు అంటున్నారు. ఈ ఐడియా బాగున్నప్పటికీ.. దీన్ని అనుకున్నంత బాగా ప్రెజెంట్ చేయలేదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఐతే ఈ చిన్న సినిమాకు ప్రచారం కల్పించి జనాల్లోకి తీసుకెళ్లడం కోసమో ఏమో.. ‘ప్లే బ్యాక్’ను వివిధ భారతీయ భాషల్లో రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు. జెమిని ఫిలిమ్స్ వాళ్లు ఈ రీమేక్‌లను తీయబోతుండటం ప్రకటించడంతో కేవలం ప్రచారం కోసమే ఈ ప్రకటన చేశారని అనుకోవడానికి లేదు. మరి నిజంగా అన్న మాట ప్రకారం ఈ చిత్రాన్ని వివిధ భారతీయ భాషల్లో రీమేక్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on March 6, 2021 7:24 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…