Movie News

యేలేటికి హామీ.. నిలబెట్టుకుంటారా?

ప్రతిభకు లోటు లేదు. ప్రతిసారీ ఏదో ఒక కొత్త కథే చెప్పాలని చూస్తాడు. రాజమౌళి సహా చాలామంది పెద్ద దర్శకులకు అతనన్నా, తన సినిమాలన్నా చాలా అభిమానం. ఎందరో యువ దర్శకులకు అతను ఆదర్శం. ఆయన శిష్యులు కూడా మంచి స్థాయిలో ఉన్నారు. అయినా సరే.. చంద్రశేఖర్ యేలేటి కెరీర్ ఎప్పుడూ సవ్యంగా సాగింది లేదు. ఒక సినిమా చేశాక.. ఇంకో సినిమా కోసం అభిమానులకు ఎదురు చూపులు తప్పవు. సినిమా సెట్ చేసుకోవడానికి ఆయన ప్రతిసారీ కష్టపడుతూనే ఉంటారు.

ఐతే, అనుకోకుండా ఒక రోజు సినిమాలతో తనపై భారీగా అంచనాలు పెంచిన యేలేటి.. ‘ఒక్కడున్నాడు’ దగ్గర్నుంచి స్ట్రగలువుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకు అవకాశాలు అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు. మధ్యలో తనే నిర్మాతగా మారి ‘ప్రయాణం’ అనే సినిమా తీసిన యేలేటికి ఆశించిన ప్రయోజనం దక్కలేదు. మనమంతా సినిమాకు ముందు, తర్వాత ఆయన కెరీర్లో చాలా గ్యాప్ వచ్చింది.

మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ ‘మనమంతా’ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్నందుకోకపోవడంతో యేలేటి మరో సినిమా చేజిక్కించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఏవేవో కాంబినేషన్లు అనుకున్నాక చివరికి నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్‌లో ‘చెక్’ చేశాడు. యేలేటిని నమ్మి మంచి బడ్జెట్లోనే ఈ సినిమా తీశారు ఆనంద్ ప్రసాద్. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. వీకెండ్‌లో కొంత జోరు చూపించిన ‘చెక్’ తర్వాత చల్లబడిపోయింది. బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ప్రకారం చూస్తే ఇది డిజాస్టరే. యేలేటి కెరీర్లోనే వీకెస్ట్ మూవీ ఇదే అని తేల్చేశారు.

మంచి మంచి సినిమాలు తీసినపుడే యేలేటికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సినిమాలు సెట్ కాలేదు. అలాంటిది ‘చెక్’ లాంటి డిజాస్టర్ తర్వాత ఆయన పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. నిజానికి ‘చెక్’ కంటే ముందు మైత్రీ మూవీ మేకర్స్‌‌తో ఆయనకు ఒక కమిట్మెంట్ ఉంది. ‘చెక్’ బాగా ఆడితే ఒక స్టార్ హీరోతో యేలేటి దర్శకత్వంలో సినిమా చేయాలని మైత్రీ అధినేతలు భావించారు. కానీ ‘చెక్’ తేడా కొట్టడంతో స్టార్ హీరో సంగతి దేవుడెరుగు. మీడియం రేంజ్ హీరోతో అయినా సినిమా చేస్తారా.. అసలు యేలేటికి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా అన్నది సందేహంగా మారింది.

This post was last modified on March 5, 2021 7:41 pm

Share

Recent Posts

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

28 minutes ago

ఒత్తిడి బండి మీద ‘రణబాలి’ ప్రయాణం

ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…

31 minutes ago

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

2 hours ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

5 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

6 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

6 hours ago