Movie News

నెట్‌ఫ్లిక్సా మజాకా.. ఈ ఏడాది సినిమాల మోతే

ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఇండియాలోకి అడుగుపెట్టడంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఇక్కడ ఆ సంస్థ దూకుడు మామూలుగా లేదు. ఆ సంస్థ దగ్గరున్న భారీ అంతర్జాతీయ కంటెంట్‌‌కు తోడు.. ఇండియన్ కంటెంట్‌ను బాగా పెంచడానికి భారీ ప్రణాళికలతోనే దూసుకెళ్తోంది. కరోనా-లాక్‌డౌన్ నెట్‌ఫ్లిక్స్‌కు బాగా కలిసొచ్చి ఇండియాలో సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయి. ఈ ఊపులో ఇండియన్ సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ మీద ఆ సంస్థ భారీగానే పెట్టుబడులు పెట్టి మరింత విస్తరించే పనిలో పడింది.

హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ పెద్ద ఎత్తున కంటెంట్ జనరేట్ చేస్తోంది. తెలుగులోనూ ఇటీవలే ‘పిట్టకథలు’తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇండియాలో థియేటర్లు పున:ప్రారంభం అయి మామూలుగానే నడుస్తున్న నేపథ్యంలో మిగతా ఓటీటీల జోరు కొంత తగ్గినట్లే ఉంది కానీ.. నెట్ ఫ్లిక్స్ మాత్రం కొత్త ఏడాదిలో భారీగా కంటెంట్ ఇవ్వబోతోందన్న స్పష్టమైంది.

సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు కలిపి మొత్తంగా ఈ ఏడాది నెట్ ఫ్లిక్స్‌లో 41 కొత్త రిలీజ్‌లు ఉండబోతుండటం విశేషం. వాటి వివరాలను నెట్ ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ చేసింది. ధనుష్ నటించిన తమిళ చిత్రం ‘జగమే తంత్రం’తో పాటు సిద్దార్థ్-అరవింద్ స్వామి-విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాంథాలజీ ఫిలిం ‘నవరస’తో పాటు హిందీలో తాప్సి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హసీనా దిల్ రుబా’, రకుల్ ప్రీత్-అర్జున్ కపూర్‌ల ‘సర్దార్ కా గ్రాండ్ సన్’, బాబీ డియోల్-అర్జున్ రాంపాల్‌ల థ్రిల్లర్ మూవీ ‘పెంట్ హౌస్’.. ఇలా ఈ జాబితాలో పేరున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

ఇవి కాక ఢిల్లీ క్రైమ్-2, అరణ్యక్, ఫైండింగ్ అనామిక, మసాబా మసాబా-2 లాంటి పేరున్న వెబ్ సిరీస్‌లు చాలానే నెట్ ఫ్లిక్స్ అందించబోతోంది. వీటి షెడ్యూల్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే డేట్లు ప్రకటించనున్నారు. ‘జగమే తంత్రం’ ముందుగా రిలీజయ్యేలా కనిపిస్తోంది. ఐతే ఈ 41 రిలీజ్‌ల్లో తెలుగు నుంచి ఏ సినిమా, సిరీస్ కానీ లేకపోవడమే విచారకరం.

This post was last modified on March 4, 2021 5:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

5 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

9 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago