మంచు వారి బాక్సాఫీస్ జర్నీ కొన్నేళ్లుగా ఎలా సాగుతోందో అందరికీ తెలిసిందే. మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి.. అలాగే మంచు మోహన్ బాబు.. వీళ్లలో ఎవరి సినిమాలూ గత కొన్నేళ్లలో ఓ మాదిరిగా కూడా ఆడలేదు. విష్ణు పరిస్థితి అయితే మరీ దారుణం. చివరగా అతడి నుంచి వచ్చిన ‘ఓటర్’ సినిమా రిలీజైనట్లు అసలు జనాలకు తెలియనే తెలియదు. దాని కంటే ముందు వచ్చిన ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా దారుణ ఫలితాన్నందుకుంది. దీంతో విష్ణు కెరీర్లో ఎన్నడూ లేనంత గ్యాప్ వచ్చేసింది.
ఐతే ఈసారి సేఫ్‌గా ఏదైనా చిన్న సినిమా చేసుకోకుండా ‘మోసగాళ్ళు’ అనే హాలీవుడ్ సినిమా చేశాడు. ఇది ప్రధానంగా ఇంగ్లిష్‌లో తెరకెక్కిన సినిమా కావడం విశేషం. ముందు హాలీవుడ్లోనే రిలీజ్ చేయాలని కూడా అనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడేమో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇది చూసి తెలుగులోనే మార్కెట్ లేని మంచు విష్ణు.. పాన్ ఇండియా రిలీజ్ అంటాడేంటి అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఐతే ‘మోసగాళ్ళు’ ట్రైలర్ చూస్తే ఇది విషయం ఉన్న సినిమాలాగే కనిపించింది. సినిమా రేసీగా.. ఉత్కంఠ భరితంగా సాగేలా అనిపించింది. విష్ణు గత సినిమాల్లో లేని క్వాలిటీ ఇందులో అగుపించింది. ఇక ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి విష్ణుకు ధీమా ఇస్తున్నది కాజల్ అగర్వాల్. ఆమె పాన్ ఇండియా స్టార్. తమిళం, హిందీలో ఆమె బాగా పాపులర్. ఆమె కోసమైనా ఇతర భాషల ప్రేక్షకులు ఈ చూస్తారని విష్ణు ఆశిస్తుండొచ్చు.
ఇందులో ముఖ్య పాత్రలు చేసిన సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, నవదీప్‌లు సైతం వేరే భాషల వాళ్లకు తెలుసు. తన సినిమా మీద కూడా భరోసా ఉండటంతో విష్ణు సాహసం చేస్తున్నట్లున్నాడు. ఈ చిత్రానికి తెలుగేతర భాషల్లో ‘అను అండ్ అర్జున్’, ‘అర్జున్ అండ్ అను’ అనే టైటిళ్లు కూడా ఖరారు చేశారు. ఈ నెల 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని చూస్తున్నాడు విష్ణు. ఈసారైనా మంచు హీరోకు సక్సెస్ అందుతుందేమో చూడాలి మరి.
This post was last modified on March 3, 2021 10:43 pm
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…