ఫిబ్రవరి మధ్య నుంచి మార్చి మధ్య వరకు అన్ సీజన్‌గా పరిగణిస్తారు మామూలు. ఆ సమయంలో పేరున్న సినిమాలు పెద్దగా రావు. ఐతే ఈసారి పరిస్థితులు మారాయి. థియేటర్లు పున:ప్రారంభమైంది ఈ మధ్యే. జనాలు మళ్లీ థియేటర్లలో సినిమాలు చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో కరోనా విరామం వల్ల విడుదల కోసం చూస్తున్న సినిమాలు చాలానే పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు పున:ప్రారంభమై, సంక్రాంతికి వసూళ్ల మోత మోగేసరికి వరుసబెట్టి సినిమాలను దించేస్తున్నారు.
వచ్చే వారం మహాశివరాత్రి కానుకగా ఒకటికి మూడు సినిమాలు రాబోతున్నాయి. ఆ మూడూ ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాలే. ఐతే కాస్ట్ అండ్ క్రూ పరంగా చూస్తే శ్రీకారం, గాలి సంపత్‌తో పోలిస్తే ‘జాతి రత్నాలు’ చిన్న సినిమా. ఇంతకుముందు ఆ చిత్రంపై పెద్దగా అంచనాల్లేవు. కానీ రిలీజ్ దగ్గర పడేసరికి ‘జాతిరత్నాలు’పై ఆసక్తి, అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
ఒకప్పట్లా తెలుగులో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు రావట్లేదిప్పుడు. కామెడీకి పెద్ద పీట వేసే ఈవీవీ లాంటి దర్శకుల్లేరిప్పుడు. పైగా ఆ టైపు సినిమాలను కూడా ప్రస్తుతం ఆదరించే పరిస్థితి లేదు. బుల్లితెరపై జబర్దస్త్ తరహా షోల ఆధిపత్యం మూలాన సినిమాల్లో చూపించే కామెడీ జనాలకు ఎక్కట్లేదు. పెద్ద సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేసిన శ్రీను వైట్ల ఇప్పుడు ఫాంలో లేడు. ఇలాంటి సమయంలో ప్రేక్షకులను ట్రెండీ కామెడీతో అలరించే సినిమాగా ‘జాతిరత్నాలు’ కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని రూపొందించిన అనుదీప్ కేవీ ఇంతకుముందు పిట్టగోడ అనే సినిమా తీశాడు. అది ప్రేమ ప్రధానంగా సాగే సినిమా. కానీ ఈసారి పూర్తిగా కామెడీ రూట్ ఎంచుకున్నాడు.
నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి ఈ తరానికి నచ్చే, మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటులను ప్రధాన పాత్రలకు తీసుకున్నాడు. ‘జాతిరత్నాలు’ నుంచి వచ్చిన ప్రతి ప్రోమో కూడా వినోదాత్మకంగా కనిపించి సినిమాపై అంచనాలు పెంచింది. దీని పాటలు సైతం భలే ఫన్నీగా అనిపిస్తున్నాయి. చూస్తుంటే పూర్తి స్థాయి వినోదంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తోంది. నిర్మాత నాగ్ అశ్విన్ అభిరుచి కూడా తోడై ‘జాతిరత్నాలు’ బాక్సాఫీస్ దగ్గర బాగానే క్లిక్ అవుతుందని, మహాశివరాత్రి సినిమాల్లో ఇది విజేతగా నిలిచే అవకాశాలు కూడా లేకపోలేదని అనిపిస్తోంది.
This post was last modified on March 3, 2021 10:30 pm
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…