Movie News

అతడికి హిట్టొస్తే అందరికీ ఆనందమే

సినీ రంగంలో పైకి అందరూ స్నేహంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఇక్కడ ఒకరి విజయాన్ని ఒకరు ఓర్వలేరని.. ఒకరి వెనుకాల ఒకరు గోతులు తవ్వుతుంటారని అంటారు. ఒక హీరో హిట్టు కొడితే సంతోషించేవాళ్ల కంటే అసూయతో రగిలిపోయే వాళ్లే ఎక్కువ అని ఇండస్ట్రీ జనాలే అంటుంటారు. ఐతే కొందరు హీరోలు మాత్రం ఇలాంటి వాటికి మినహాయింపుగా ఉంటారు. వాళ్లను చూస్తే అజాత శత్రువు అనే ఫీలింగ్ కలుగుతుంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ.. అందరి వాడిలా పేరు తెచ్చుకుని.. నిష్కల్మషంగా కనిపించే అలాంటి హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకప్పుడు టాలీవుడ్లో అతడి హవా ఎలా సాగిందో తెలిసిందే. విరామం లేకుండా సినిమాలు చేస్తూ అడపా దడపా హిట్లు కొడుతూ కెరీర్లో దూసుకెళ్తుండేవాడు. అతడి సినిమాలు వేరే చిత్రాలకు పోటీగా ఎవరూ భావించేవారు కాదు. నరేష్ ప్రధానంగా చేసేవి కామెడీ సిినిమాలు కాబట్టి అందరూ వాటిని ఎంజాయ్ చేసేవాళ్లు. అందరూ అతణ్ని ఇష్టపడేవాళ్లు.

కాబట్టే నరేష్ ఎనిమిదేళ్లుగా హిట్టు లేక ఇబ్బంది పడుతుంటే.. అందరూ బాధ పడ్డవాళ్లే. తమను ఎంతో నవ్వించిన నరేష్‌కు ఒక హిట్టు పడితే చూడాలని ప్రేక్షకులు ఎలా కోరుకున్నారో.. ఇండస్ట్రీ జనాలు కూడా అంతే ఆశించారు. ఇప్పుడు ‘నాంది’ సినిమాతో అతను విజయాన్నందుకుంటే అందరూ ఆనందిస్తున్నవాళ్లే. ‘నాంది’ పాజిటివ్‌ టాక్ తెచ్చుకోవడంతో రిలీజ్ రోజు నరేష్ ఎంత ఉద్వేగానికి గురయ్యాడో తెలిసిందే. ఆ ఉద్వేగంలో కన్నీళ్లు కూడా పెట్టేసుకున్నాడు. అది చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఎమోషనల్ అయిపోయారు.

ఆ తర్వాత అందరూ ఈ సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. పాజిటివ్ ట్వీట్లు వేసి సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇధి సినిమాకు బాగానే కలిసొచ్చింది. ‘నాంది’కి అంతకంతకూ కలెక్షన్లు పెరిగాయి. ప్రేక్షకుల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ‘బుక్ మై షో’లో ఈ చిత్రానికి 93 పర్సంట్ రేటింగ్ వచ్చిందంటే వాళ్లు ఈ సినిమాకు ఎంతగా సపోర్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు.

This post was last modified on March 1, 2021 8:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

37 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago