‘సమ్మోహనం’ సినిమాతో ప్రేమకథను తెరకెక్కించడంలో తన నైపుణ్యాన్ని చాటుకున్నాడు సీనియర్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. కెరీర్ మొత్తంలో ఆయనకదే అత్యుత్తమ చిత్రం ఆశ్చర్యం లేదు. లవ్ స్టోరీలను ఇష్టపడేవాళ్లు ఈ సినిమాతో ప్రేమలో పడిపోయారు. మళ్లీ మళ్లీ ఈ సినిమా చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. ఇంద్రగంటి ఇలాంటి పూర్తి స్థాయి ప్రేమకథలు అంతకు ముందు ఒక్కటీ తీయలేదు కానీ.. ప్రేమ సన్నివేశాలను మాత్రం ఎంతో అందంగా తీర్చిదిద్దాడు.
‘సమ్మోహనం’ తర్వాత తనపై అంచనాలు బాగా పెరిగిపోయిన సమయంలో తన శైలికి భిన్నంగా పూర్తి స్థాయి యాక్షన్ సినిమా ప్రయత్నించి గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు ఇంద్రగంటి. నాని-సుధీర్ బాబుల కాంబినేషన్లో ఆయన తీసిన ‘వి’ తీవ్ర నిరాశకు గురి చేసింది. కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందనుకున్న ఈ చిత్రం.. ఆయనకు చెడ్డ పేరు తెచ్చి కెరీర్లో కొంచెం గ్యాప్ వచ్చేలా చేసింది.
ఇప్పుడు మళ్లీ తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో ఇంద్రగంటి తన బలం అయిన ప్రేమకథనే ఎంచుకున్నాడని తేలిపోయింది. సుధీర్ బాబుతో వరుసగా తన మూడో చిత్రాన్ని ఈ మధ్యే మొదలుపెట్టిన ఇంద్రగంటి.. ఈ సినిమా ఎలా ఉండబోతోందో ఈ రోజు హింట్ ఇచ్చాడు. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ మార్చి 1న రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిన్న సర్ప్రైజ్ వీడియో వదిలింది చిత్ర బృందం.
ఇందులో సుధీర్ బాబు ఒక థియేటర్ ప్రొజెక్షన్ రూంలో నిలుచుని.. మీరు ప్రేమించిన అమ్మాయి గురించి తొలిసారి మీ స్నేహితులకు ఎలా వివరించారో గుర్తుందా అని ప్రశ్నించాడు. మీ అనుభవాలను కింద కామెంట్ల రూపంలో చెప్పమన్నాడు. తాను ఎలా ఆ విషయం చెప్పానో తెలుసుకోవాలంటే మార్చి 1 వరకు వేచి చూడమన్నాడు. ఆ రోజే తన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజవుతుందని సుధీర్ బాబు చెప్పాడు. చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తున్న ఈ వీడియో చూస్తే ఇంద్రగంటి మళ్లీ ఫామ్ అందుకున్నట్లే.. ఆయన్నుంచి మళ్లీ ఓ మంచి ప్రేమకథ రాబోతున్నట్లే అనిపిస్తోంది.
This post was last modified on February 27, 2021 2:24 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…
రాజకీయ నేతలు సవాళ్లు చేయడం తెలుసు. అదే విధంగా ప్రతిజ్ఞలు చేయడం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా…