మున్ముందు ఈ ఏడాది భారీ చిత్రాలు చాలానే రాబోతున్నప్పటికీ.. ఉప్పెన ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. పెట్టుబడి-రాబడి పరంగా చూసుకుంటే భారీ చిత్రాలను కూడా వెనక్కి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ రూ.25 కోట్ల పెట్టుబడితో సినిమా తీస్తే.. థియేట్రికల్ రన్ ద్వారానే దానికి రెట్టింపు షేర్ రాబట్టబోతోంది ఉప్పెన. ఈ వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం ఆ మైలురాయిని దాటబోతోంది. ఉప్పెన జోరు ఈ వారం కూడా ఆగేట్లు కనిపించడం లేదు.
థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయమే కాక మైత్రీ సంస్థకు డిజిటల్, శాటిలైట్, రీమేక్ హక్కుల రూపంలోనూ పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడేట్లుంది. ఈ మొత్తం కలిపితే మైత్రీ అధినేతలకు ఈ సినిమా ద్వారా వచ్చిన లాభం దాదాపు రూ.45 కోట్ల దాకా ఉండబోతోందని సమాచారం. అందులోంచి సుకుమార్‌కు సైతం వాటా రూపంలో పెద్ద మొత్తంలో దక్కనుందట.
నిజానికి సుక్కుకు ఉప్పెన సినిమాకు సంబంధించి ఏ క్రెడిట్ లేదు. ఆయన కథ అందించడం, మాటలు రాయడం లాంటివేమీ చేయలేదు. అలాగే ఈ చిత్రానికి డబ్బులు కూడా పెట్టలేదు. కానీ స్క్రిప్టు చర్చల్లో కీలకంగా ఉన్నారు. దాన్ని సరిదిద్దారు. మేకింగ్‌ను పర్యవేక్షించారు. రషెస్ చూసి మార్పులు చేర్పులు సూచించారు. తన శిష్యుడిని వెనుక ఉండి నడిపించారు. అలాగే ఈ సినిమా పోస్టర్ల మీద సుకుమార్ రైటింగ్స్ అని ఆయన బేనర్ పేరు వేసి ప్రమోషన్‌కు ఆయన బ్రాండును బాగానే వాడుకున్నారు.
ఐతే ఉప్పెన సినిమాకు స్క్రిప్టు, ప్రమోషన్లో ఉపయోగపడినందుకు గాను ఇప్పుడు సుకుమార్‌కు రూ.10 కోట్ల దాకా ముట్టినట్లు సమాచారం. మైత్రీ వాళ్లు సంతోషంగానే ఆయనకు వాటా కింద ఈ మొత్తం అందిస్తున్నారట. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా భారీ విజయాన్నందుకోవడంతో సుకుమార్ ప్రతిష్ట కూడా ఎంతో పెరిగింది. అది ఆయనకు మరింతగా కలిసొచ్చే విషయమే.
This post was last modified on February 27, 2021 10:07 am
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……