Movie News

సమంతకు జోడీగా ఇంకెవరూ దొరకలేదా?


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వెండితెరపై కనిపించి ఏడాది దాటిపోయింది. చివరగా ‘జాను’ సినిమాలో చూశాం ఆమెను. ఆ సినిమా వచ్చింది వెళ్లింది తెలియనట్లుగా జరిగిపోయింది. ఒకప్పట్లా స్టార్ల సరసన నటించడానికి సమంత ముందుకు రావట్లేదో లేక ఆమేనే అలాంటి పాత్రలకు ఒప్పుకోవట్లేదో తెలియలేదు కానీ.. సమంత కెరీర్లో ‘జాను’ తర్వాత బాగా గ్యాప్ వచ్చేసి ఆమె ఇక మళ్లీ సినిమాలు చేస్తుందా లేదా అన్న సందేహాలు కలిగాయి.

ఇలాంటి తరుణంలోనే సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ అనే పురాణ గాథను తెరకెక్కించడానికి ముందుకొచ్చాడు సీనియర్ దర్శకుడు గుణశేఖర్. ఐతే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా రోజులవుతోంది కానీ.. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. సినిమాలో ముఖ్య పాత్రధారుల విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యంగా శకుంతల పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో ఎవరు చేస్తారనే ఆసక్తితో అందరూ ఉన్నారు.

సమంతకు దీటుగా ఓ పేరున్న నటుడినే దుష్యంతుడి పాత్రకు ఎంచుకుంటారని అంతా భావించారు. కానీ గుణశేఖర్ ఈ విషయంలో ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్నాడు. తెలుగు వాళ్లకు పరిచయం లేని మలయాళ నటుడిని ఈ పాత్రకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నటుడి పేరు.. దేవ్ మోహన్. మలయాళంలో కూడా అతను పెద్ద స్టారేమీ కాదు. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్నాడు. చేసిన సినిమా ఒక్కటే. అలాంటి నటుడిని సమంతకు జోడీగా ఇలాంటి భారీ చిత్రానికి ఎంచుకున్నారన్న వార్త ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమాలో సమంతనే హైలైట్ చేయాలని భావించి ఉండొచ్చు. ఆమె ఇమేజ్ మీదే సినిమాను నడిపించాలని అనుకుని ఉండొచ్చు.

అయినా సరే.. ఆమె ఇమేజ్‌కు తగ్గట్లు పేరున్న నటుడినే తీసుకుని ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ చిత్రంలో ఈషా రెబ్బా మరో ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. మణిశర్మ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

This post was last modified on February 26, 2021 6:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కష్టే ఫలి!.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!

పార్టీ కోసం కష్ట పడే వారికే పదవులు దక్కుతాయి. పార్టీని నమ్ముకున్నవారికి ఎన్నటికీ అన్యాయం జరగదు. ఈ మాటలు టీడీపీ…

51 minutes ago

రాములమ్మకు ఎమ్మెల్సీ.. అగ్ర నేతల మాట నెగ్గలేదు

తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన ఖాతాలోని మూడు ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. అంతా అనుకున్నట్లుగా పార్టీ…

2 hours ago

వారంతా లేన‌ట్టే..

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్‌(శ్రీశైలం కుడి కాల్వ‌) టన్నెల్‌లో గ‌త నెల 22న జ‌రిగిన ప్ర‌మాదంలో చిక్కుకు పోయిన‌.. ఆరుగురు…

3 hours ago

శక్తి యాప్.. ఫోన్ ను షేక్ చేస్తే చాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మహిళలకు మరింత భద్రత లభించింది. ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు నేతృత్వంలోని…

4 hours ago

బరిలోకి ఇద్దరు బీఆర్ఎస్ నేతలు… కేసీఆర్ వ్యూహమేంటో?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మొత్తం 5 స్థానాలు…

4 hours ago

మ‌హిళా సెంట్రిక్‌గా కూట‌మి అడుగులు.. !

రాష్ట్రంలో మ‌హిళా ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యం తెలిసిందే. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ మ‌హిళ‌ల ఓటు…

5 hours ago