Movie News

బుల్లిపెట్టె లో బూచాడు.. నీళ్ల టబ్బు లో..

బడిపంతులు సినిమాలో సూపర్ హిట్ అయిన పాట ఇది.. బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టె లో వున్నాడు.. కళ్లకెపుడు కనబడడు.. కబురులెన్నో చెబుతాడు.. ఎన్టీఆర్ మానమరాలిగా నటించి ఈ పాట పాడిన బాలనటి బెబీ శ్రీదేవి.. తెలుగు తమిళ్ కన్నడ మళయాళ సినిమాలలో నటించిన బాలనటి పద్నానుగు ఏళ్లకే ఇంకో రెండు కలుపుకుని పదహారేళ్ల వయసులో హీరోయిన్ గా చేసింది శ్రీదేవి.

“సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా”… కేవలం ఈ పాట చూడటానికే కుర్రాళ్ళు ఎగబడ్డారు అప్పట్లో.. దీనికి దర్సకేంద్రుడు రాఘవేంద్ర రావు డైరక్టర్.. మరల నాలుగు భాషలలో హీరోయిన్ గా నటించింది.. వేటగాడు సినిమాకి హీరోయిన్ కోసం వెతికే క్రమం లో శ్రీదేవి పేరు కూడా అనుకున్నారు.. కానీ ఎన్టీఆర్ కి ఈ విషయం చెప్పటానికి సందేహించారు.. ఆయనే హీరోయిన్ ఎవరనుకుంటున్నారు బ్రదర్ అని అడిగితె నీళ్లు నములుతున్నారు.. “బ్రదర్.. మీరేదో మదనపడుతున్నట్టున్నారు.. పర్వాలేదు మీ మనసులో ఉన్నమాట చెప్పండి “.. అన్నారు.. అప్పుడు శ్రీదేవి పేరు చెప్పారు.. శ్రేదేవి అయితే ప్రాబ్లమ్ ఏముంది ఓకే ” అన్నారు ఆయన.. అప్పుడు krr ‘కాదండీ.. తను మీకు మానవరాలిగా నటించింది.. పైగా ఇప్పుడు ఆమెకు పదిహేడేళ్లే “.. అన్నారు.. “ఏం బ్రదర్.. మనకి కూడా పదిహేడే.. ఏం పర్వాలేదు.. ఆమెనే పెట్టండి “.. అన్నారు ఆలా ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించింది..

“ఆకుచాటు పిందె తడిచే.. కొకమాటు పిల్ల తడిచే”అనే పాట ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేసింది.. “జాబిలితో చెప్పనా”..ఇక అక్కడినుంచి మొదలెడితే ఎన్టీఆర్.. ఏన్నార్.. కృష్ణ.. శోభన్ బాబు వీళ్లందరినీ ఒక ఊపు ఊపేసింది. తమిళ్ లో రజనీకాంత్.. కమలహాసన్ లని ఒక ఆట ఆడుకుంది.. హిందీ కెళ్ళి జితేంద్ర.. మితున్ చక్రవర్తి.. అమితాబ్ తో సహా అందర్నీ కవర్ చేసింది.. తెలుగులో అతిలోక సుందరిగా అవతరించి జగదేకవీరుడిని కూడా చిత్తు చేసింది.. ఏన్నార్ తో చేసాను కదా అని ఆగిపోలేదు.. నటసామ్రాట్ కొడుకు యువసామ్రాట్ తో జతకట్టి ఆఖరిపోరాటం చేసింది..పదహారేళ్ల వయసు సినిమా నుండి ఆమెను ఫాలో అవుతున్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆమెకి భక్తుడైపోయాడు.. శ్రీదేవి సినిమా వస్తే చాలు అదే పనిగా సినిమా హాల్ నే కాలేజ్ గా మార్చుకుని రోజూ వెళ్లి కూర్చునే వాడు.. అతను సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి డైరక్టర్ అయ్యి మొదటి సినిమానే సూపర్ హిట్ తీసాడు.. ఆ సినిమా శివ.. ఆ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఆ వర్మ కి కలిసివచ్చిన అదృష్టం లా కెమెరా మాన్ గోపాలరెడ్డి శ్రీదేవితో సినిమా చేద్దామా అంటే ఎగిరి గంతేశాడు.. అప్పుడు ప్రారంభమైంది క్షణలక్షణం..

వెంకటేష్ హీరో.. K రాఘవేంద్ర రావు కి ఏమాత్రం తగ్గకుండా అంతకంటే అందంగా శ్రీదేవిని ప్రెసెంట్ చేసాడు.. రాఘవేంద్ర రావే స్వయంగా నేను జామురాతిరి పాటకు ఫాన్ ని అని చెప్పాడు.. మళ్ళీ శ్రేదేవి నాగ్ ని పెట్టి గోవిందా గోవిందా అని తీసాడు.. సీతారామశాస్త్రి తో ప్రత్యేకంగా ఒక పాట రాయించాడు.. “అమ్మ బ్రహ్మదేముడో కొంపముంచినావురా “.. కేవలం శ్రీదేవి అందాన్ని వర్ణిస్తూ… చిన్నచిన్న ఎక్సప్రెషన్స్ కూడా అద్భుతంగా పలుకుతుంది ఆ ఫేసులో… డైరక్టర్ ఒక క్యారక్టర్ చెబితే ఆలా అల్లుకుపోతుంది.. క్షణక్షణం లో శ్రీదేవితో ఒక పాట కూడా పాడించాడు.. “కింగులా కనిపిస్తున్నాడు.. మరి ఒంగి ఒంగి దండాలెందుకు పెడుతున్నాడు.. ఏమా సరదా గమ్మత్తుగాలేదా” అని.. ఆ ఫేస్ లో నవరసాలలో ఏ రసమైనా అద్భుతమంగా పలుకుతుంది..
అటువంటి శ్రీదేవి బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల తల్లి అయ్యింది.. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కి వెళ్లి అక్కడ ఒక బాత్ టబ్ లో చనిపోవడం అనేది హృదయవిదారకమైన వార్త.. ఆ వార్త తెలిసిన ఎంతమంది అభిమానులు తల్లడిల్లి పోయారో.. Rgv అయితే ఒక్కడే కూర్చుని రోజంతా ఆమె వీడియో లు చూస్తూ అచేతనంగా వుండిపోయాడు.. తన స్టేట్మెంట్ లో.. “j క్లాస్ లో దర్జా గా కూర్చుని వెళ్లిన శ్రీదేవి.. కార్గోలో మూట కట్టిన ఆమె బాడీ ఫ్లయిట్ కుదుపులకు కదులుతూ వస్తుందన్న ఊహనే భరించలేకున్నాను.. అసలు శ్రీదేవి చనిపోవడమేమిటి”..అని.. . ఫిబ్రవరి 24 న ఆమె చనిపోయింది.. శ్రీదేవి అభిమానులందరి తరపున ఆమె ని స్మరించుకుంటూ.. నివాళులు అర్పిస్తూ… శ్రీదేవి మరల పుట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి మరల హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను….

— శివ నాగేశ్వర రావు

This post was last modified on February 25, 2021 11:22 am

Share
Show comments
Published by
Satya
Tags: Sridevi

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

2 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

3 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

3 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

4 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

5 hours ago