సినీ పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో పని చేసిన ప్రతి ఒక్కరూ మెగా ఫోన్ పట్టేయరు. దర్శకుడిగా అవకాశం అందుకున్నా సరే.. సరైన సినిమా పడాలి, దానికి క్రేజ్ రావాలి, అది బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాలి. అప్పుడే అన్నేళ్లు పడ్డ కష్టానికి ఫలితం ఉంటుంది.
ఐతే ఇలా అందరికీ జరగదు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఎన్నో కష్టాలు పడి, అవమానాలు ఎదుర్కొని, గుర్తింపుకు నోచుకోని వాళ్లు.. తొలి సినిమాతో అద్భుత విజయాన్ని అందుకోవడంతో రాత్రికి రాత్రి వారి జీవితాలు మారిపోయిన ఉదంతాలు చాలానే టాలీవుడ్లో కనిపిస్తాయి. ‘ఉప్పెన’తో పరిచయం అయిన యువ దర్శకుడు బుచ్చిబాబుది ఇలాంటి స్టోరీనే.
ప్రస్తుతం టాలీవుడ్లో అతడికి మామూలు డిమాండ్ లేదు. ‘ఉప్పెన’ రిలీజవ్వడానికి ముందే అతడికి అవకాశాలివ్వడానికి కొందరు ముందుకొచ్చారు. ఈ సినిమా రిలీజై సంచలన విజయం సాధించాక బుచ్చిబాబు కోసం చాలామంది నిర్మాతలు, హీరోల ఆరాలు మొదలయ్యాయి. ‘ఉప్పెన’ను నిర్మించిన మైత్రీ సంస్థే అతడితో ఇంకో రెండు సినిమాలకు ఒప్పందం చేసుకుంది. వీటిలో స్టార్ హీరోలు నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఇప్పుడింత డిమాండ్లో ఉన్న బుచ్చిబాబు ఎనిమిదేళ్ల కిందట అతి సామాన్యంగా ఉన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది.
సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తుండగా.. ‘1 నేనొక్కడినే’ సినిమాకు మహేష్ బాబు మీద క్లాప్ కొడుతున్న ఫొటో అది. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి. ఇప్పటి కంటే చాలా బక్కగా, సెట్లో పని చేసే బాయ్ మాదిరిగా ఉన్నాడు బుచ్చిబాబు అందులో. ఆ ఫొటో చూస్తే ఇతను దర్శకుడు అవుతాడని ఎవరూ అనుకుని ఉండరు. అప్పుడు బుచ్చిబాబు ఎవరి మీద క్లాప్ కొట్టాడో అదే హీరో ఇప్పుడు ‘ఉప్పెన’ను టైం లెస్ క్లాసిక్‌గా అభివర్ణిస్తూ, బుచ్చిబాబును పొగిడేస్తూ ట్వీట్ వేశాడు. ఎనిమిదేళ్లలో బుచ్చిబాబు సాధించిన ప్రగతికి ఇది నిదర్శనమని.. అతణ్ని చూసి దర్శకులు కావాలని కలలు కంటూ కష్టపడే కుర్రాళ్లు స్ఫూర్తి పొందాలని సోషల్ మీడియా జనాలు సూచిస్తున్నారు.
This post was last modified on February 24, 2021 10:47 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…