ఒకప్పుడు హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఏడాదికి మినిమం మూడు సినిమాలు చేస్తూ పోయాడు మాస్ రాజా రవితేజ. మినిమం గ్యారెంటీ హీరోగా ఏడాదికి మూడు హిట్లు కొడుతూ వచ్చిన రవితేజకు 2018లో ‘టచ్ చేసి చూడు’, ‘నేల టికెట్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్స్ వచ్చాయి. ఆ ఎఫెక్ట్‌తో 2019లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు రవితేజ.
ఏడాది గ్యాప్ తీసుకుని చేసిన ‘డిస్కోరాజా’ ఆశించిన రిజల్ట్‌ను ఇవ్వలేదు. దాంతో రవితేజ గేర్ మార్చారట. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ పోవాలని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం ‘బలుపు’తో మంచి కమ్‌బ్యాక్ హిట్టు ఇచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేనితో ‘క్రాక్’ సినిమా చేస్తున్న రవితేజ… లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మరో మూడు సినిమాలను ఒకేసారి మొదలెట్టబోతున్నాడు.
‘క్రాక్’ సినిమా షూటింగ్ దాదాపు ముగిసింది. మిగిలిన పార్ట్ లాక్‌డౌన్ ముగియగానే పూర్తిచేసి… రమేశ్ వర్మ, నక్కిన త్రినాథరావు, వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి అంగీకరించాడట గోపిచంద్. ‘రాక్షసుడు’ ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో తమిళ్ సూపర్ హిట్ ‘సతురంగ వేట్టయ్ 2’ను రీమేక్ చేస్తున్న రవితేజ… ‘నాపేరు సూర్య… నా ఇల్లు ఇండియా’తో డైరెక్టర్‌గా మారిన రచయిత వక్కంతం వంశీకి సెకండ్ మూవీ ఛాన్స్ ఇస్తున్నాడు. అలాగే ‘మేం వయసుకు వచ్చాం’, ‘సినిమా చూపిస్తా మామ’, ‘నేను లోకల్’ వంటి సినిమాలతో యూత్‌ఫుల్ లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు దక్కించుకున్న డైరెక్టర్ త్రినాథరావు నక్కినతో సినిమా కన్ఫార్మ్ చేశాడు.
నలుగురు డిఫరెంట్ దర్శకులతో సినిమాలు చేస్తూ… సినిమా, సినిమాకీ వెరియేషన్ చూపించాలని ఫిక్స్ అయినట్టున్నాడు రవితేజ. ఈ ఫోర్ మోర్ షాట్స్ మనోడికి ఎలా కలిసొస్తాయో చూడాలి.
This post was last modified on May 8, 2020 6:47 pm
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…