అల్లరి నరేష్ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చినట్లుంది. గత కొన్నేళ్లలో అతడి ఏ సినిమాకూ రాని స్పందన కొత్త చిత్రం ‘నాంది’కి వస్తోంది. ఒక దశలో టాలీవుడ్లో బిజీయెస్ట్ హీరోగా ఉన్న నరేష్.. గత ఎనిమిదేళ్లలో ఫ్లాపుల మీద ఫ్లాపులతో అల్లాడిపోయాడు. నరేష్ సినిమాలంటేనే ప్రేక్షకులు బెంబేలెత్తిపోయి థియేటర్ల వైపు రాని పరిస్థితి కనిపిస్తోంది కొన్నేళ్ల నుంచి. గత నెలలో విడుదలైన ‘బంగారు బుల్లోడు’ విషయంలోనూ అదే జరిగింది.
ఐతే తన కామెడీ ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా సీరియస్ కథతో నరేష్ చేసిన ‘నాంది’ మాత్రం ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ మోస్తరుగా జరిగాయి. ఓపెనింగ్స్ కూడా పర్వాలేదు. టాక్ కూడా నాట్ బ్యాడ్ అనిపిస్తోంది. శుక్రవారం రిలీజైన మూడు చిత్రాల్లో మెరుగైంది ‘నాంది’నే. తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం సినిమాకు కలిసొచ్చే అంశం. సినిమాను సరిగా ప్రమోట్ చేసుకుంటే లాభాల బాట పట్టే అవకాశముంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఆలస్యం చేయకుండా చిన్న స్థాయిలో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన నరేష్.. ఒక దశలో ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టేసుకోవడం విశేషం. సినిమాలో తన తండ్రి పాత్ర చేసిన దేవీ ప్రసాద్‌ను పట్టుకుని అతను ఉద్వేగంతో ఏడ్చేశాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. 2012లో వచ్చిన సుడిగాడు తన చివరి పెద్ద హిట్ మూవీ అని, ఆ తర్వాత తనకు అంతటి విజయం ‘నాంది’నే అని చెప్పాడు.
ఎనిమిదేళ్లు తనకు హిట్ లేకపోయినా.. తన దగ్గరికి వచ్చి ఇమేజ్‌కు భిన్నంగా ఓ సీరియస్ సినిమా చేద్దామని చెప్పడానికి చాలా ధైర్యం కావాలని.. ఆ ధైర్యం, ప్రోత్సాహం నిర్మాత సతీశ్ వేగేశ్న ఇచ్చారని.. తన రెండో ఇన్నింగ్స్‌కు విజయ్ కనకమేడల ‘నాంది’ పలికాడని ఉద్వేగంతో చెప్పాడు. శుక్రవారం ఉదయం నుంచి తనకు వరుసగా ఫోన్లు వస్తున్నాయని, ఇకపై ఇలాంటి మంచి సినిమాలే చేయమని అందరూ ప్రోత్సహిస్తున్నారని నరేష్ అన్నాడు.
This post was last modified on February 20, 2021 4:39 pm
సంక్రాంతి పండక్కి ప్రతిసారీ సినిమాను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తుంటారు దిల్ రాజు. ఒకవేళ తన ప్రొడక్షన్లో సినిమా లేకపోయినా..…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ చివరి దశ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతోంది. జనవరి 12…
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…