టాలీవుడ్లో చాలామంది హీరోలకు తిరుగులేని మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన, పెద్ద స్టార్లను చేసిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. రవితేజ పెద్ద హీరో అయ్యాడంటే అది పూరి తీసిన ‘ఇడియట్’ వల్లే. మహేష్ బాబు సూపర్ స్టార్ స్టేటస్ సాధించి, ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి కారణమైన ‘పోకిరి’ పూరి సినిమానే అన్న సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్‌ను అరంగేట్ర సినిమాతోనే స్టార్‌ను చేసిన ఘనత కూడా పూరీదే.
ఇంకా చాలామంది హీరోలకు పెద్ద హిట్లు ఇచ్చాడు పూరి. కానీ తన కొడుకు పూరి ఆకాశ్‌ను మాత్రం ఆయన హీరోగా నిలబెట్టలేకపోయాడు. టీనేజీలో ‘ఆంధ్రా పోరి’ లాంటి అనవసర సినిమా చేయించాడు. తర్వాత తాను పూర్తిగా ఫామ్ కోల్పోయిన సమయంలో ‘మెహబూబా’ లాంటి పేలవమైన సినిమాతో అతణ్ని హీరోగా లాంచ్ చేశాడు. దీంతో ఆకాశ్ అడుగులు తడబడ్డాయి. అతను హీరోగా ఏమాత్రం నిలదొక్కుకుంటాడో అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఇలాంటి తరుణంలో తన స్క్రిప్టుతోనే మళ్లీ ఆకాశ్ రీలాంచింగ్‌కు రంగం సిద్ధం చేశాడు పూరి. ఆయన శిష్యుడు అనిల్ పాడూరి దర్శకత్వంలో రెండేళ్ల కిందట ‘రొమాంటిక్’ అనే సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లే కనిపించింది. ఫుల్ రొమాంటిక్‌గా ఉన్న పోస్టర్లకు తోడు ఒక హాట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సినిమా ఇక థియేటర్లలోకి దిగడమే తరువాయి అనుకున్నారు. ఈలోపు కరోనా అడ్డం పడింది. ఆ తర్వాత సినిమా వార్తల్లో లేకుండా పోయింది.
లాక్ డౌన్ టైంలో ‘రొమాంటిక్’ ఓటీటీలో రిలీజవుతుందని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాక కూడా ఈ సినిమా ఊసే లేదు. ‘రొమాంటిక్’ ఏ దశలో ఉందో కూడా తెలియట్లేదు. పూరి ఈ సినిమా గురించి మాట్లాడనే మాట్లాడట్లేదు. దాని సంగతేంటో తేల్చకుండానే ఆకాశ్ కొత్త సినిమాను మొదలుపెట్టారు. ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ఆకాశ్ హీరోగా ‘చోర్ బజార్’ అనే సినిమా తీయనున్నాడు. ఆ దర్శకుడి ట్రాక్ రికార్డూ ఏమీ బాగా లేదు. ఆకాశ్ పరిస్థితీ అంతంతమాత్రంగా ఉంది. అసలు ‘రొమాంటిక్’ సంగతేంటో తేల్చకుండా పూరి ఇలాంటి ప్రాజెక్టును లైన్లో పెట్టాడేంటి అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి పూరి ఏం సమాధానం చెబుతాడో?
This post was last modified on February 18, 2021 7:09 pm
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…
రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని.. అయితే..దీనిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా…