సిద్ శ్రీరామ్.. గత కొన్నేళ్లలో సౌత్ ఇండియన్ మ్యూజిక్ లవర్స్ నోళ్లలో తెగ నానుతున్న పేరిది. ఎ.ఆర్.రెహమాన్ ఐ సినిమాలో నువ్వుంటే నా జతగా పాటతో ఈ విలక్షణ గాత్రాన్ని తమిళ, తెలుగు సంగీత ప్రియులకు పరిచయం చేశాడు. ఈ వాయిస్ భలే వెరైటీగా ఉందే అనుకున్నారు అప్పటికి. ఆ తర్వాత అతను పాడిన మరికొన్ని పాటలు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టాయి.
ఇక గీత గోవిందం సినిమాలో సిద్ పాడిన ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే పాట సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాటతో సిద్ ఒక్కసారిగా టాప్ రేంజికి వెళ్లిపోయాడు. ఆ పాట అప్పటికి సౌత్ ఇండియన్ సినిమా సాంగ్స్ యూట్యూబ్‌లో నెలకొల్పిన రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. గీత గోవిందం సినిమాకు రిలీజ్ ముంగిట బంపర్ క్రేజ్ రావడంలో ఈ పాట కీలక పాత్ర పోషించిందంటే అతిశయోక్తి కాదు.
ఇక అక్కడి నుంచి సిద్‌తో ఓ పాట పాడించి సినిమాకు హైప్ తీసుకురావడం ఒక ట్రెండ్ అయిపోయింది. ట్యాక్సీవాలాలో మాటే వినదుగా.. హుషారులో అందం అమ్మాయైతే.. అల వైకుంఠపురములో మూవీలో సామజవరగమన.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీలో నీలి నీలి ఆకాశం.. శశిలో ఒకే ఒక లోకం నువ్వు.. ఇలా ఆయా చిత్రాలకు సిద్ పాటలు ఎంతగా ప్లస్ అయ్యాయో తెలిసిందే. వీటిలో హుషారు, 30 రోజుల్లో ప్రేమించడం లాంటి చిన్న సినిమాల గురించి జనాలకు ముందు తెలిసిందే సిద్ పాటల వల్ల.
అవే ఆయా చిత్రాలకు ఒక హైప్ తీసుకొచ్చాయి. ఆ సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రావడానికి కారణమయ్యాయి. దీంతో సిద్‌కు క్రేజ్ ఇంకా పెరిగిపోతోంది. ఒక్కో పాటకు నాలుగైదు లక్షల దాకా సిద్ డిమాండ్ చేస్తున్నా సరే.. కళ్లు మూసుకుని నిర్మాతలు ఆ డబ్బులిచ్చేసి అతడితో పాట పాడించేస్తున్నారు. తాజాగా నల్లమల అనే చిన్న సినిమా కోసం సిద్ ఓ వెరైటీ పాట పాడాడు. ఆ పాట కూడా ఎంతో శ్రావ్యంగా ఉండి శ్రోతలను ఆకర్షిస్తోంది. ఈ పాటతో ఆటోమేటిగ్గా సినిమా మీద ప్రేక్షకులకు ఆసక్తి పుడుతుందని భావిస్తున్నారు. కేవలం ఒక గాయకుడిని నమ్ముకుని సినిమాలను సేల్ చేసుకునే ట్రెండ్ చిత్రమైందే.
This post was last modified on February 16, 2021 3:16 pm
కలసి ఉంటే కలదు సుఖం.. అన్నట్టుగా కూటమిగా ఢిల్లీలో నిలబడి ఉంటే.. ఇండియా కూటమి ఘన విజయం దక్కించుకునేది.. అనేందుకు…
రెండు నెలల కిందట విడుదలైన ‘పుష్ప-2’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే.…
పెళ్లిళ్లు జరగడం.. జరగకపోవడం అనేది కామనే. కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్న పెళ్లిళ్ల కంటే కూడా.. రద్దవుతున్న పెళ్లిళ్ల వ్యవహారాలు…
ప్రధాని నరేంద్ర మోడీకి ఈ శనివారం అత్యంత ఇష్టమైన రోజు. ఎందుకంటే… పదేళ్లకు పైబడి ఢిల్లీ సీఎం సీటును చేజిక్కించుకునేందుకు…
ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ సాధించినా పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ఏదీ జరగలేదనే…
భారతదేశంలో ఆధార్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 జనవరిలో 284 కోట్ల ఆధార్ ధృవీకరణ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే…