నటుడిగా విజయ్ సేతుపతి స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న నెగెటివ్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్‌తో మొదలుపెట్టి ‘పిజ్జా’ అనే మరో చిన్న సినిమాతో హీరోగా అరంగేట్రం చేసి.. నటుడిగా అద్భుతమైన ప్రతిభ చాటుకుని తిరుగులేని రేంజికి వెళ్లాడతను. అతడి ప్రతిభేంటో ఇతర భాషల వాళ్లకూ బాగానే తెలిసింది. థియేటర్లలో డబ్బింగ్ సినిమాలకు తోడు ఓటీటీల్లో అతను నటించిన తమిళ సినిమాలు చూసి మైమరిచిపోయిన ఇతర భాషల ప్రేక్షకులు.
టాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా అతడి ప్రతిభకు ఫిదా అయిపోయి తమ సినిమాల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ‘సైరా’తో పాటు ‘ఉప్పెన’ చిత్రంలోనూ నటించాడు సేతుపతి. ఐతే ‘సైరా’లో అంతా చిరంజీవి డామినేషనే కనిపిస్తుంది. సేతుపతి పాత్ర అంచనాలకు తగ్గ స్థాయిలో ఉండదు. కానీ ‘ఉప్పెన’ అలా కాదు. పెర్ఫామెన్స్ పరంగా అతను విశ్వరూపం చూపించడానికి అవకాశమిచ్చింది. సినిమాకు అతి పెద్ద బలం ఆయన పాత్ర, నటనే.
‘ఉప్పెన’లో సేతుపతి చేసిన శేషారాయణం పాత్రకు సంబంధించి ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. ఈ అంచనాల్ని అతనెలా అందుకుంటాడో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ సేతుపతి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, పెర్ఫామెన్స్‌తో ఆ అంచనాలను దాటిపోయాడు. ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన వాళ్లెవ్వరూ సేతుపతి నటనకు మెస్మరైజ్ కాకుండా ఉండలేరు. ఈ సన్నివేశంలో డైలాగుల పరంగా హీరోయిన్ కృతి శెట్టిదే ఆధిపత్యం అంతా. దాదాపు పది నిమిషాల పాటు సేతుపతికి ఇక్కడ డైలాగులే ఉండవు. కృతి చాలా హృద్యమైన డైలాగులతో హైలైట్ అవుతుంది. సినిమాకు అత్యంత బలంగా నిలిచింది క్లైమాక్స్‌లో హీరోయిన్ నోటి వెంట వచ్చే డైలాగులే.
ఐతే అలాంటి సన్నివేశంలో ఒక్క డైలాగ్ చెప్పకుండా సేతుపతి తన హావభావాలతో తన ప్రత్యేకత చాటుకున్న తీరు అమోఘం. సేతుపతి పాత్రలో ఆలోచన మొదలై, అతడిలో మార్పు వచ్చిన వైనాన్ని కేవలం హావభావాలతో మాత్రమే చూపించారు. నోటి వెంట ఒక్క మాటా రాకుండా విలన్ పాత్రలో పరివర్తన వచ్చిన విషయాన్ని ప్రేక్షకులు ఫీలవుతారు. సీన్ ఆరంభంలో పరమ కర్కోటకుడిగా కనిపించిన సేతుపతి.. చివరికొచ్చేసరికి మారిన మనిషిలా అనిపిస్తాడు. అలాగే ఓవర్ ద టాప్ ఎక్స్‌ప్రెషన్స్ ఏమీ ఇవ్వలేదు సేతుపతి. ముఖంలో చిన్న చిన్న మార్పులతోనే భావాలు పలికించి నటుడిగా తన స్థాయి ఏంటో చాటి చెప్పాడు.
This post was last modified on February 15, 2021 5:43 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…