ఎదురు చూపులకు తెరదించుతూ ‘రాధేశ్యామ్’ గ్లింప్స్‌తో ప్రభాస్ అభిమానులను పలకరించింది చిత్ర బృందం. ఈ సందర్భంగానే సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఐతే మినీ టీజర్ లాగా కనిపించిన ఫస్ట్ గ్లింప్స్ అంచనాలకు తగ్గట్లు లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న టాక్. ముఖ్యంగా మన వాళ్ల సంగతేమో కానీ.. ప్రభాస్ నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ ఈ టీజర్ పట్ల తీవ్ర నిరాశ, విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
‘రాధేశ్యామ్’ పూర్తి స్థాయి ప్రేమకథ అనే సంకేతాలు ముందు నుంచి అందుతున్నప్పటికీ టీజర్ మరీ క్లాస్‌గా ఉండటం, ప్రభాస్ నుంచి ఆశించే మాస్ అంశాలు లేకపోవడం పట్ల నార్త్ ఇండియాలో ప్రధానంగా అతడికి ఫాలోయింగ్ ఉన్న మాస్ వర్గాల్లో సినిమా పట్ల నిరాసక్తత వ్యక్తమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక లవ్ స్టోరీలను ఇష్టపడేవాళ్లను సైతం ఈ ఫస్ట్ గ్లింప్స్ ఏమంత ఎగ్జైట్ చేయలేదు.
ఏదో ఆశిస్తే మరీ సింపుల్‌గా తేల్చేశారనే అభిప్రాయాలు మెజారిటీ ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ ఏమంత గొప్పగా లేదు. ఇక అతడికి రాసిన డైలాగ్ కూడా సాధారణంగా అనిపించింది. విజువల్‌గా, ఆర్ఆర్ పరంగానూ ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఓవరాల్‌గా ‘రాధేశ్యామ్’ సినిమా స్థాయికి తగ్గ ఫస్ట్ గ్లింప్స్ కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మాత్రం దానికి ఇన్ని రోజులు ఊరించి, హైప్ ఇవ్వడం దేనికన్న కౌంటర్లు పడుతున్నాయి.
ముఖ్యంగా ఇతర భాషల వాళ్లే ఈ టీజర్‌ను ఎక్కువగా విమర్శిస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం కొందరు ‘రాధేశ్యామ్’ ఫస్ట్ గ్లింప్స్ పట్ల నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. టీజర్, ట్రైలర్‌తో ఇంప్రెషన్ మార్చకుంటే సినిమాకు ఆశించిన హైప్ రాదని వారు అభిప్రాయపడుతున్నారు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణం రాజుతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 14, 2021 8:11 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…