రకుల్ ప్రీత్ చెక్ ఏమైపోతుందో?

రకుల్ ప్రీత్ సింగ్ కి రాక రాక నితిన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. టాప్ హీరోయిన్ గా నిలిచిపోతుందని అనుకున్న దశలో సడన్ గా సినిమాల్లేకుండా అయిపోయిన రకుల్ చాలా కాలం తర్వాత నితిన్ తో చంద్రశేఖర్ ఏలేటి తీయబోతున్న చెక్ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

రంగ్ దే పూర్తి చేసి, పెళ్లి పనులు అయిన తర్వాత చెక్ మొదలు పెట్టాలని నితిన్ భావించాడు. అయితే ఇప్పుడు రంగ్ దే ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు. మరోవైపు తానూ చేద్దామని అనుకున్న అంధాధూన్ రీమేక్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో చెక్ సినిమా చేస్తాడా, లేక ఒక ఏడాది వాయిదా వేస్తాడా అనే దానిపై స్పష్టత లేదు. నితిన్ కి వచ్చే నష్టం ఏమి ఉండదు కానీ రకుల్ కి మాత్రం ఇదొక్కటే ఆఫర్ ఉంది.

ఇదిలా వుంటే లాక్ డౌన్ లో మెడిసిన్స్ కొనుక్కోడానికి వెళ్లిన రకుల్ ని లిక్కర్ కొనుక్కోడానికి వెళ్ళిందంటూ ప్రచారం చేసారు. దీనిపై వీడియోలు చేసి ఇండస్ట్రీలో హీరోలు అందరిని సపోర్ట్ కి రమ్మని పిలవకుండా… మెడికల్ షాప్ లో మద్యం ఎప్పట్నించి అమ్ముతున్నారంటూ సింపుల్ గా కొట్టి పడేసింది. కాంట్రవర్సీ చేయడం కూడా ఆర్టే మరి!