హీరో కొత్తవాడు.. హీరోయినూ కొత్తమ్మాయే.. దర్శకుడూ కొత్త వాడే.. ఇలాంటి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమాకు ఓపెనింగ్స్ కష్టమే. ఇలాంటి చిత్రానికి విడుదలకు ముందు హైప్ తీసుకురావడమూ సులువైన విషయం కాదు. కానీ కొత్త హీరో హీరోయిన్లు పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా.. డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు సానా రూపొందించిన ‘ఉప్పెన’ చిత్రం మాత్రం అనూహ్యమైన క్రేజ్ సంపాదించుకుంది రిలీజ్ ముంగిట. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజిలో జరిగాయి. ఇక రిలీజ్ తర్వాత దీని క్రేజ్ రెట్టింపయినట్లే కనిపిస్తోంది. ఒక పెద్ద సినిమా స్థాయిలో ఇది బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుండటం విశేషం.
ఫిబ్రవరిలో సాధారణంగా కొత్త సినిమాలకు థియేటర్ల దగ్గర అంతగా సందడి కనిపించదు. ఓపెనింగ్స్ కూడా కష్టంగానే ఉంటుంది. హౌస్ ఫుల్ బోర్డులూ అరుదే. కానీ ‘ఉప్పెన’ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. గత ఏఢాదంతా కరోనా కారణంగా థియేటర్లలో సినీ వినోదానికి దూరమైన అభిమానులు.. రెండు నెలల కిందటే థియేటర్లు తెరుచుకున్నాక మంచి సినిమాల కోసం ఆవురావురుమని ఉన్నారు. సంక్రాంతికి ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకున్న ‘క్రాక్’ సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు ప్రేక్షకులు.
ఆ తర్వాత బాక్సాఫీస్ కొంచెం డల్ అయింది. సరైన సినిమాలు పడలేదు. ఐతే ‘ఉప్పెన’ సినిమా మీద ప్రేక్షకుల్లో ముందు నుంచి ఆసక్తి ఉండగా.. ఇటీవల అది మరింత పెరిగింది. రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి హైప్ కొన్ని రెట్లు పెరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ చూసే జనాలు షాకయ్యారు. ఇక రిలీజ్ రోజు ఉదయం సినిమాకు మంచి టాక్ రావడంతో జనాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఏపీ, తెలంగాణల్లోని అన్ని సిటీలు, టౌన్లలో మెజారిటీ థియేటర్లలో ‘ఉప్పెన’ను నింపేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపిస్తోంది. అన్ని సిటీలు, టౌన్లలో సినిమా ఇరగాడేస్తోంది. ఒకే కాంప్లెక్స్‌లో ఉన్న 3-4-5 థియేటర్లు అన్నింట్లో ఈ సినిమానే ఆడిస్తున్నారు. దీంతో పాటే రిలీజైన ‘ఎఫ్.సి.యు.కె’కు ముందు నుంచే బజ్ లేకపోగా.. బ్యాడ్ టాక్ కూడా తోడై అది వాష్ ఔట్ అయిపోయే పరిస్థితి వచ్చింది.
‘ఉప్పెన’ పరిస్థితి చూస్తే ఇటు ఆన్ లైన్లో చూసినా, అటు ఆఫ్ లైన్లో అయినా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. వీకెండ్ మొత్తానికి టికెట్లు బుక్ అయిపోతున్నాయి. తొలి వారాంతంలో ‘ఉప్పెన’ బాక్సాఫీస్ దగ్గర అనూహ్యమైన నంబర్స్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on February 13, 2021 10:47 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…