తారక్ అల్టిమేటం.. అతడిక అన్నిట్లో!

ఎన్టీఆర్ ఇకపై చేసే అన్ని సినిమాలకు నిర్మాణంలో కళ్యాణ్ రామ్ భాగస్వామిగా ఉంటాడట. ఆర్.ఆర్.ఆర్. చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ ఈ డెసిషన్ తీసుకున్నాడట. సోలోగా కళ్యాణ్ రామ్ పై భారం పడకుండా తానూ చేసే చిత్రాల్లో నిర్మాతతో జరిగిన ఒప్పందం ప్రకారం భాగస్వామ్యం ఇవ్వాలని తారక్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.

త్రివిక్రమ్ తో హారిక హాసిని సంస్థ నిర్మించే చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగస్వామ్యం గురించి తెలిసిందే. ఎన్టీఆర్ పారితోషికంలో ఎలాంటి మార్పులు ఉండవు. హీరో, దర్శకుడు, ఇతర పారితోషికాలు అన్నిటికీ కలిపి బడ్జెట్ వేసి, జరిగిన బిజినెస్ లో కళ్యాణ్ రామ్ తో మాట్లాడుకున్న ప్రకారం వాటా ఇచ్చేయాలి.

కళ్యాణ్ రామ్ తానే హీరోగా చేసే ప్రయత్నాలన్నీ బయటి బ్యానెర్లలో చేసుకుంటాడు తప్ప మునుపటిలా చేతులు కాల్చుకుని పని పెట్టుకోవడం లేదు.