తెలుగులో ఒక టైంలో క్రేజీ హీరోయిన్‌గా ఉండేది రెజీనా కసాండ్రా. అందానికి అందం, అభినయానికి అభినయం.. రెండూ ఉన్న ఈ భామ పెద్ద రేంజికి వెళ్తుందన్న అంచనాలు కలిగాయి. కానీ రవితేజ, సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, గోపీచంద్ లాంటి మీడియం రేంజ్ హీరోలతో నటించి.. ఆ స్థాయి నుంచి పైకి వెళ్లలేకపోయింది. ఒక దశ దాటాక మీడియం రేంజ్ సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు కరవయ్యాయి. చివరగా అడివి శేష్‌తో కలిసి చేసిన ‘ఎవరు’ మంచి ఫలితాన్నందుకున్నప్పటికీ తెలుగులో ఆమె కెరీర్ ఊపందుకోలేదు.
ఇక్కడ డౌన్ అయిన టైంలోనే తమిళంలో రెజీనా కొంచెం పుంజుకుంది. అవకాశాలు అందుకుంది. కానీ అక్కడ కూడా వరుసగా పరాజయాలు పలకరించేసరికి రెజీనా కెరీర్ డోలాయమానంలో పడింది. ఆమె కెరీర్‌ను మలుపు తిప్పుతుందనుకున్న ఓ సినిమా నిరవధికంగా వాయిదా పడటం కూడా ప్రతికూలంగా మారింది. ఐతే సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
విలక్షణ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రెజీనా, ఎస్జే సూర్య, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా.. నెంజం మరప్పుదిల్లై. తమిళంలో ఇప్పటిదాకా రాని ప్రయోగాత్మక కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా మొదలైనపుడు.. మేకింగ్ టైంలో, ట్రైలర్ వచ్చినపుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేగింది. ట్రైలర్ షాక్‌ల మీద షాక్‌లు ఇచ్చింది. సూర్య ఒక సైకో తరహా పాత్ర పోషించాడిందులో. రెజీనా, నందితల పాత్రలూ కొత్తగా అనిపించాయి. ఈ సినిమా వీళ్లందరి కెరీర్లలోనూ గేమ్ చేంజర్ అవుతుందనుకుంటే.. ఏవేవో కారణాలతో విడుదల కాకుండా ఆగిపోయింది.
చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. మధ్యలో సెల్వ.. సూర్య హీరోగా ‘ఎన్జీకే’ అనే సినిమా కూడా తీశాడు. ఇక ఈ చిత్రం విడుదలే కాదని అనుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మార్చి 5న ‘నెంజం మరప్పుదిల్లై’ విడుదల కానుంది. తమిళంలో మంచి ఫలితాన్నందుకుంటే తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on February 8, 2021 4:45 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…