Movie News

నా బ్రాండ్లన్నీ పోయాయి – కంగనా రనౌత్

కంగనా రనౌత్ ఇప్పుడు బాలీవుడ్లో సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తోంది. ఆమెకంటూ అక్కడ వర్గం తయారైంది. ఆ వర్గంలోని వాళ్లు మాత్రమే ఆమెతో సినిమాలు చేస్తారు. మిగతా వాళ్లందరూ ఆమెకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్లో టాప్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు చాలా వరకు కంగనాకు దూరమే. ఎందుకంటే ఆమెతో పని చేస్తే ఎప్పుడే వివాదంలో చిక్కుకుంటామో.. తమ మీద ఏం ఆరోపణలు చేస్తుందో తెలియని పరిస్థితి.

హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆలియా భట్, మహేష్ భట్.. ఇలా కంగనా నుంచి తీవ్ర ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న బాలీవుడ్ సెలబ్రెటీలు ఎంతోమంది ఉన్నారు. ఈ మధ్య అయితే పరోక్షంగా రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టేసిన కంగనా కోరి వివాదాలు తెచ్చుకుంటోంది. ఫైర్ బ్రాండ్ అన్న గుర్తింపు ఏమో కానీ.. ఇంతటి వివాదాస్పద వ్యక్తితో తమకెందుకు అన్నట్లు ఇటు ఫీచర్ ఫిలిం మేకర్లే కాదు.. యాడ్ ఫిలిం మేకర్లు కూడా దండం పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది.

తన మీద అడ్వర్టైజ్మెంట్ రంగంలోనూ ఒక రకమైన వివక్ష నడుస్తోందని.. తాను వద్దనుకున్న బ్రాండ్లు చాలానే ఉండగా, తన చేతిలో ఉన్న బ్రాండ్లు కూడా చేజారి పోతున్నాయని కంగనా తాజాగా వ్యాఖ్యానించింది. తాను మామూలుగానే ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్స్ చేయనని, కోట్లు ఆఫర్ చేసినా వాటిని తిరస్కరించానని.. ఇక సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కు తాను దూరమని, వేరే షోస్ కూడా ఏవీ చేయనని కంగనా చెప్పుకొచ్చింది.

అలాగే పెద్ద హీరోలతోనూ తాను సినిమాలు చేయట్లేదని.. ఇంతకుముందు తనతో కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయని, వాటిని తర్వాత రద్దు చేసుకున్నాయని.. ప్రస్తుతం తన చేతిలో ఒక్క బ్రాండ్ కూడా లేదని కంగనా చెప్పింది. దీని వల్ల తాను చాలా ఆదాయం కోల్పోయానని.. అయినా అధైర్య పడలేదని.. తనకు ఉన్న దాంట్లో ఇప్పటికీ చాలామందికి సాయం చేస్తూ వెళ్తున్నానని.. దాని ద్వారా తనకు దక్కే ఆనందమే వేరని కంగనా వ్యాఖ్యానించింది.

This post was last modified on February 7, 2021 8:04 am

Share

Recent Posts

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

43 minutes ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

1 hour ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

5 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

6 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

7 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

7 hours ago