ఈ తరం తెలుగు ప్రేక్షకులకు నమిత గురించి పెద్దగా తెలియదు కానీ.. 2000-2010 మధ్య ఆమె దక్షిణాదిన పెద్ద సెన్సేషన్. తెలుగులో ‘సొంతం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ఉత్తరాది భామ.. విక్టరీ వెంకటేష్ సరసన ‘జెమిని’తో పాటు బాలయ్యతో ‘సింహా’లోనూ నటించింది. మరికొందరు స్టార్లతోనూ జోడీ కట్టింది.
ఐతే మొదట్లో మామూలుగానే కనిపించింది కానీ.. తమిళంలోకి అడుగు పెట్టాక మాత్రం ఆమె రూటు మార్చేసింది. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే భారీగా తయారైన నమిత.. కొన్ని సినిమాల్లో వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేసి షాకిచ్చింది. ఆమె భారీ అందాలు తమిళ అభిమానులకు మత్తెక్కించాయి. ఐతే ఒక దశ దాటాక నమిత మరీ బరువెక్కిపోయి చూడ్డానికి ఎబ్బెట్టుగా తయారైంది. ఆమె మద్యం, సిగరెట్‌కు బానిస అయిపోయిందని.. ఈ క్రమంలోనే బరువు విపరీతంగా పెరిగిపోయాయని వార్తలొచ్చాయి. ఇలా ఉండగానే నమిత పెళ్లి కూడా చేసుకుంది.
ఆ తర్వాత వార్తల్లో లేకుండా పోయిన నమిత.. ఇటీవల ఉన్నట్లుండి బాగా బరువు తగ్గి హీరోయిన్ అయిన కొత్తలో మాదిరి తయారై షాకిచ్చింది. బాగా బరువు తగ్గిన నమిత జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో కూడా ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థతో మాట్లాడిన నమిత.. తన గురించి ఒక సమయంలో విపరీతమైన దుష్ప్రచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను బరువు పెరగడానికి అందరూ అనుకున్నట్లు సిగరెట్, మద్యం లాంటి దురలవాట్లు కారణం కాదని ఆమె చెప్పింది. తనకు అలాంటి అలవాట్లు లేవంది.
తాను డిప్రెషన్ కారణంగా ఐదున్నరేళ్ల పాటు నరకం చూశానని చెప్పింది. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని, బాగా నిద్ర పోవడం కోసం అతిగా తినేసేదాన్నని, జంక్ ఫుడ్ బాగా అలవాటైందని, అలాగే థైరాయిడ్ సమస్య కూడా ఉండటంతో తన బరువు అదుపు తప్పిందని నమిత చెప్పింది. ఇవన్నీ తెలియక తన గురించి తప్పుడు ప్రచారాలు చేశారని నమిత వాపోయింది. ఇప్పుడు తన ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోయాయని, కష్టపడి వర్కవుట్లు చేసి మునుపటి షేప్‌లోకి వచ్చానని ఆమె వెల్లడించింది.
This post was last modified on February 3, 2021 4:02 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…