నటరాజన్.. కొన్ని నెలలుగా భారత క్రికెట్ ప్రియుల చర్చల్లో విపరీతంగా నానుతున్న పేరిది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌కు అనామకుడిలా వచ్చిన ఈ తమిళనాడు కుర్రాడు.. నాలుగు నెలలు తిరిగేసరికి భారత అభిమానుల దృష్టిలో హీరో అయిపోయాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ జట్టు తరఫున సంచలన ప్రదర్శనతో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ముఖ్యంగా మేటి బ్యాట్స్‌మెన్‌ను తన యార్కర్లతో అతను ముప్పు తిప్పలు పెట్టిన తీరు చర్చనీయాంశమైంది.
ఐపీఎల్‌లో మెరుపులతో అనుకోకుండా ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా ఎంపికైన నటరాజన్.. తన రాష్ట్రానికే చెందిన వరుణ్ చక్రవర్తి గాయపడటంతో అతడి స్థానంలో టీ20 జట్టులోకి వచ్చాడు. తర్వాత వన్డే జట్టులోనూ చోటు దక్కింది. ముందుగా వన్డేల్లో, ఆ తర్వాత టీ20ల్లో అరంగేట్రం చేసి చక్కటి ప్రదర్శన చేయడంతో టెస్టు జట్టులోకి కూడా ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్ సందర్భంగా పలువురు బౌలర్లు గాయపడటంతో చివరి టెస్టులోనూ ఆడే అవకాశం దక్కింది. అందులోనూ అతను రాణించాడు.
క్రికెటర్‌గా నటరాజన్ కెరీర్ ఇంత వేగంగా ఇలాంటి మలుపులు తిరుగుతుందని ఎవరూ అనుకోలేదు. నటరాజన్ వ్యక్తిగత జీవితంలోనూ మలుపులకు లోటే లేదు. తమిళనాడులోని సేలం నగరానికి 36 కిలోమీటర్ల దూరంలోని ఓ పల్లెటూరిలో ఓ పేద కుటుంబంలో అతను పుట్టాడు. అతడితో కలిసి తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం. ఇంట్లో అందరూ పడుకోవడానికి కూడా చాలినంత ఖాళీ ఉండేది కాదట. తల్లి చికెన్ పకోడీలు వేస్తే, తండ్రి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదగడమంటే మాటలు కాదు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు నట్టూ.
ఈ నేపథ్యంలో తమిళ ఫిలిం మేకర్స్ అనేకమంది అతడి జీవితాన్ని వెండి తెరపైకి తేవాలని చూస్తున్నారు. తన బయోపిక్ కోసం చాలామంది రచయితలు, దర్శకులు వచ్చి కలిశారని, కానీ ప్రస్తుతం తన దృష్టంతా క్రికెట్ మీదే అని, తాను ఇంకా సాధించాల్సింది చాలా ఉందని, ఈ దశలో తన బయోపిక్ రావడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో అందరికీ నో చెప్పేశానని, ఇంకెవరూ ఆ దిశగా ప్రయత్నాలు చేయొద్దని ఓ మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో స్పస్టం చేశాడు నట్టూ.
This post was last modified on February 2, 2021 10:57 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…