వినడానికి కొంచెం చిత్రంగా అనిపించొచ్చు. కానీ బాలయ్యతో నారా రోహిత్ కలిసి నటిస్తున్నట్లుగా ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది టాలీవుడ్లో. బాలయ్య ప్రస్తుతం తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశారు. ఇందులో నారా రోహిత్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడట. అతను ఎమ్మెల్యేగా కనిపించనున్నాడని, ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని, కథలో కీలక మలుపుకు ఆ పాత్ర కారణమవుతుందని అంటున్నారు.
ఈ పాత్ర కోసం ఓ స్టార్ హీరోను బోయపాటి సంప్రదించాడని, అతను అంగీకరించకపోవడంతో నారా రోహిత్‌తో దాన్ని చేయిస్తున్నారని చెబుతున్నారు. ఒకప్పుడు విరామం లేకుండా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేసిన రోహిత్.. రెండేళ్లకు పైగా ఖాళీగా ఉన్నాడు. ఆల్రెడీ కమిటైన సినిమాలను పక్కన పెట్టాడు. కొత్తవీ చేయట్లేదు. మధ్యలో బరువు తగ్గి, లుక్ మార్చుకుని కొత్తగా కనిపించాడు కానీ.. సినిమా మాత్రం ఏదీ కమిటవ్వలేదు. హీరోగా ఏ సినిమా మొదలుపెట్టని అతను.. బాలయ్య సినిమాలో ప్రత్యేక పాత్రతో తన పునరాగమనాన్ని చాటబోతున్నాడని అంటున్నారు.
తన కుటుంబానికి దగ్గరి వాడైన రోహిత్‌కు బాలయ్య బ్రేక్ ఇవ్వాలని చూస్తుంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. బోయపాటి ఇలాంటి ప్రత్యేక పాత్రలను బాగా డిజైన్ చేస్తాడని పేరుంది. రోహిత్ కోసం మరింత శ్రద్ధ పెట్టే ఉండొచ్చు. ఈ సినిమాలో హీరో బాలయ్య అన్నది తప్పితే ఆర్టిస్టుల గురించి ఇప్పటిదాకా ఏ సమాచారం బయటికి రాలేదు. హీరోయిన్లు, విలన్లు, ఇతర పాత్రధారుల గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. దేని గురించి బోయపాటి అండ్ కో అధికారికంగా ప్రకటించలేదు. మరి నారా రోహిత్ విషయం ఏమవుతుందో చూడాలి.
This post was last modified on February 2, 2021 11:55 am
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహారం చూస్తుంటే...…
సంగీత దర్శకుడు తమన్ చూడ్డానికి చాలా సరదా మనిషిలా కనిపిస్తాడు. సోషల్ మీడియాలో తన మీద ఎలాంటి కామెంట్లు పడుతుంటాయో…
గేమ్ ఛేంజర్ పాటల విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, ఒక కంపోజర్ గా తాను పాతిక నుంచి ముప్పై…
టాలీవుడ్ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి నిండా సమస్యల్లో చిక్కుకుపోయి ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా...…
నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద బడ్జెట్ సినిమాగా చెప్పుకుంటున్న రాబిన్ హుడ్ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే…
టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సీక్వెల్స్ లో ఒకటి కల్కి 2898 ఏడి. వెయ్యి కోట్ల గ్రాస్ సాధించిన బ్లాక్ బస్టర్…