నాలుగేళ్ల కిందట టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్‌గా వెలుగొందింది రకుల్ ప్రీత్. కానీ తర్వాత రెండేళ్లు గడిచేసరికి ఆమెకు తెలుగులో అవకాశాలు కరువైపోయాయి. వరుస ఫ్లాపుల వల్ల ఆమె డౌన్ అయిపోయింది. ఒక దశలో టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయిపోయే పరిస్థితి వచ్చింది. అలాగని ఆమె కెరీర్ పూర్తిగా ఏమీ పాడైపోలేదు.
తెలుగులో జోరు తగ్గించినా హిందీలో ఆమెకు మంచి మంచి అవకాశాలే వచ్చాయి. అజయ్ దేవగణ్ లాంటి పెద్ద హీరో సరసన చేసిన ‘దే దే ప్యార్ దే’ సినిమా హిట్టయి అక్కడ బిజీ అయ్యేలా చేసింది.
అజయ్ స్వీయ దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమా ‘మే డే’లో రకులే హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. అజయ్ నటించబోయే మరో సినిమాలోనూ ఆమె అవకాశం దక్కించుకుంది. ఇవి కాక హిందీలో ఇంకో మూడు సినిమాల్లో నటిస్తోంది రకుల్. తెలుగులోనూ ఆమె ‘చెక్’తో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ రెండు చిత్రాలు రకుల్ ఖాతాలో ఉన్నాయి.
ఇప్పుడు హిందీలో ఆమెకు మరో క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కింది.
గత కొన్నేళ్లలో వరుస హిట్లతో స్టార్‌గా ఎదిగిన ఆయుష్మాన్ ఖురానాతో రకుల్ జోడీ కట్టబోతోంది. అతను హీరోగా ‘డాక్టర్ జి’ సినిమాలో రకుల్ కథానాయికగా నటించనుంది. ఇందులో ఆమె డాక్టర్ ఫాతిమా అనే పాత్రలో కనిపించనుంది. నిజానికి ఈ పాత్రను ‘సూపర్ 30’ భామ మృణాల్ ఠాకూర్ చేయాల్సింది. ఏవో కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. తర్వాత కొన్ని పేర్లను పరిశీలించి రకుల్‌ను ఓకే చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. అనుభూతి కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్ నిర్మించనుంది.
This post was last modified on February 1, 2021 4:57 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…