అల్లు అర్జున్ కి రీ-మేకోవర్!

పుష్ప సినిమా కోసం అల్లు అర్జున్ జుట్టు, గడ్డం బాగా పెంచాడు. నాచురాలిటీ కోసం కత్తెర పడకుండా అలాగే చింపిరి జుట్టు, చింపిరి గడ్డం ఉంచేద్దాం అనుకున్నారు. పుష్ప ఫోటోషూట్ నాటికి బన్నీకి పర్ఫెక్ట్ మేకోవర్ అయింది. షూటింగ్ కి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో కరోనా వచ్చి పడింది. దీంతో అందరు రెండు నెలలుగా షూటింగ్ చేయలేకపోతున్నారు. ఈ టైములో అల్లు అర్జున్ జుట్టు, గడ్డం ఇంకా పెరిగింది. దీంతో కత్తెర వేయక తప్పడం లేదట.

ఎలాగో షూటింగ్ మొదలు కావడానికి సమయం పడుతుంది కనుక చేంజెస్ చేస్తున్నారట. షూటింగ్ మొదలయ్యే నాటికీ మళ్ళీ ఫోటోషూట్ టైం కి ఉన్న లుక్ వచ్చేలా స్టయిలిష్ట్స్ వర్క్ చేస్తున్నారు. ఇదిలా వుంటే పుష్ప కాస్ట్యూమ్స్ కోసం అల్లు అర్జున్ వేసుకునే బట్టలని టీలో నానబెట్టి ఒక రెండు రోజుల తర్వాత ఉతుకుతున్నారట. అలా ఆటను వేసుకునే బట్టల్లో కూడా నాచురల్ లుక్ వచ్చేలా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.