Movie News

‘ఫ్యామిలీ మ్యాన్’ అభిమానులకు షాక్


భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఒరిజినల్స్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్’ ఒకటి. మన ఆడియన్స్‌ను ఓటీటీల వైపు మళ్లించిన సిరీస్‌ల్లో కూడా ఇదొకటిగా చెప్పుకోవాలి. ఈ సిరీస్ చూసేందుకే ఎంతోమంది అమేజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. తెలుగు వాళ్లే అయిన రాజ్-డీకే రూపొందించిన ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ప్రియమణి కూడా ఆకట్టుకుంది. ఇక టెర్రరిస్టుల ఆపరేషన్లు.. వాటిని అడ్డుకుంనేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు పడే కష్టాల నేపథ్యంలో సాగే కథాకథనాలు ఉత్కంఠభరితంగా సాగి ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించింది.

తొలి సీజన్ విడుదలైన ఏడాదిన్నర తర్వాత ‘ఫ్యామిలీ మ్యాన్’ రెండో సీజన్ విడుదలకు ముహూర్తం చూసుకుంది అమేజాన్ ప్రైమ్. కరోనా విరామం వల్ల రెండో సీజన్ ఆలస్యం కాగా.. ఫిబ్రవరి 12న దీని ప్రిమియర్స్ వేయాలని నిర్ణయించారు. ట్రైలర్‌కు కూడా రంగం సిద్ధం చేశారు. దీంతో ఈ సిరీస్ అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. కానీ వారి ఉత్సాహానికి బ్రేకులు వేస్తూ ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను వాయిదా వేయాలని నిర్ణయించుకుంది అమేజాన్ ప్రైమ్. వాయిదా అంటే ఒక డేట్ నుంచి మరో డేట్‌కు మార్చడం కాదు. నిరవధికంగా వాయిదా వేస్తున్నారట. విడుదలపై స్పష్టత లేదట. ఇప్పుడిప్పుడే ఈ సిరీస్ రిలీజ్ కాదట.

అమేజాన్ ప్రైమ్ గత కొన్ని నెలల్లో రిలీజ్ చేసిన మీర్జాపూర్-2, తాండవ్ సిరీస్‌లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌ను చాలా చెడుగా చూపించారని ‘మీర్జాపూర్-2’ మీద, హిందువుల సెంటిమెంట్లు దెబ్బ తీసేలా దేవుళ్లను తప్పుగా చిత్రీకరించారని ‘తాండవ్’ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేసులు కూడా పెట్టారు. కోర్టులు కూడా అమేజాన్ ప్రైమ్, ఆయా సిరీస్‌ మేకర్స్ మీద సీరియస్ అయ్యాయి. ఇవి అనుకున్న దాని కంటే పెద్ద వివాదాలయ్యాయి. కేసులు ప్రైమ్ వాళ్ల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. వీటి సెగ ‘ఫ్యామిలీ మ్యాన్-2’కు తాకింది.

ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆ సిరీస్‌ను రిలీజ్ చేయొద్దని ప్రైమ్ వాళ్లు నిర్ణయించుకున్నారు. నిజానికి ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ విషయంలోనూ గతంలో కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ప్రస్తుత వివాదాల నేపథ్యంలో అందులోనే ఏవైనా అభ్యంతరకర సన్నివేశాలుంటే ప్రైమ్ వాళ్లు మరింతగా ఇరుక్కుపోతారు. అందుకే ప్రస్తుత వివాదాలు చల్లబడే వరకు ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను రిలీజ్ చేయొద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on January 31, 2021 3:05 pm

Share

Recent Posts

వినాయక చవితి పూజా విధానం 2026

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో భక్తిశ్రద్ధలతో గణపతి పూజ నిర్వహిస్తారు. పూజకు కావాల్సిన సామగ్రి సిద్ధం చేసుకుని, వినాయకుడిని…

16 minutes ago

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…

2 hours ago

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

3 hours ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

4 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

5 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

5 hours ago