‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ఇచ్చేశారని ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్లంతా ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా ఉంటే.. దర్శక నిర్మాతలు మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నారు. దీనికి ముఖ్య కారణం.. ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘మైదాన్’ సైతం దసరా సీజన్‌కే షెడ్యూల్ కావడం, దాని నిర్మాత బోనీ కపూర్.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే.
తమ సినిమా అక్టోబరు 15కు షెడ్యూల్ అయిందని తెలిసి కూడా అజయ్ కీలక పాత్ర చేస్తున్న సినిమాను అదే సీజన్లో రిలీజ్ చేయడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ‘బాహుబలి’తో తిరుగులేని ఆదరణ సంపాదించుకున్న రాజమౌళి.. తన కొత్త సినిమాను హాలిడే వీకెండ్లో రిలీజ్ చేయాల్సిన అవసరముందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. జక్కన్న నిర్ణయం అనైతికమని పెద్ద కామెంటే చేశారాయన. ఈ విషయంలో అజయ్ ఆగ్రహంతో ఉన్నట్లు కూడా ఆయన సంకేతాలు ఇచ్చారు.
ఇంతకుముందు ‘బాహుబలి’లో శ్రీదేవిని నటింపజేసే విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి అప్పట్లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి. ఈ సినిమాకు శ్రీదేవిని అడిగితే ఆమె అలవిమాలిన డిమాండ్లు చేసిందని రాజమౌళి ఆరోపించాడు. ఆ తర్వాత శ్రీదేవి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. రాజమౌళి ఆత్మరక్షణలో పడేలా వ్యాఖ్యలు చేసింది. దీంతో జక్కన్న ఏమీ మాట్లాడలేని పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు శ్రీదేవి భర్త బోనీ చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజమౌళి ఇబ్బంది పడుతున్నాడు.
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ నిర్ణయం తదని కాదని, నిర్మాత డిసైడ్ చేశాడని తప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడేమో నిర్మాత డీవీవీ దానయ్య లైన్లోకి వచ్చి.. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌ను నిర్ణయించింది డిస్ట్రిబ్యూటర్లు, ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న వాళ్లే అని తాను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇలా ఒకరి మీద ఒకరు చాటుకోవడం చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ బోనీ వ్యాఖ్యలతో ఇరుకున పడ్డట్లే కనిపిస్తోంది. నిజానికి తన సినిమాల విషయంలో అన్నీ డిసైడ్ చేసేది రాజమౌళే అని చాలామంది అభిప్రాయం. ప్రమోషన్లు, రిలీజ్ సహా అన్నీ ఆయనే ప్లాన్ చేస్తారంటారు. ఈ నేపథ్యంలో జక్కన్న తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’కు ఆ డేట్ ఎంచుకున్నామని ఓపెన్‌గా చెప్పేస్తే పోయేది. కానీ ఆయన తప్పించుకోవాలని చూసి ఇరుకున పడ్డట్లున్నారు.
This post was last modified on January 31, 2021 2:56 pm
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…