రాధేశ్యామ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఈ మూడింట్లో చాలా కొత్తగా ఉంటుందనే ఆశ రేకెత్తిస్తున్న సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయేదే. మహానటితో ఔరా అనిపించిన నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో ఒక వినూత్న ప్రయోగం చేయబోతున్నాడనే సంకేతాలు ముందు నుంచి అందుతున్నాయి.
ఇది ఆదిత్య 369 సినిమాకు మోడర్న్ వెర్షన్ అనే ప్రచారం ఎప్పట్నుంచో నడుస్తున్నాయి. అందులో మాదిరి ఫాంటసీ టచ్ ఉంటుందో లేదో కచ్చితంగా చెప్పలేం కానీ.. ఇదొక సైంటిఫిక్ థ్రిల్లర్ అనేది మాత్రం స్పష్టమవుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ముందు నుంచి ఈ దిశగా సంకేతాలు ఇస్తూనే ఉన్నాడు. ఆదిత్య 369 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటార్‌తో పెట్టుకోవడం కూడా ఈ ప్రచారానికి ఊపునిస్తున్నదే.
తాజాగా ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాకు డానీ సాంచెజ్ లోపెజ్‌ను ఛాయాగ్రాహకుడిగా, మిక్కీ జే మేయర్‌ను సంగీత దర్శకుడిగా ఖరారు చేశారు. మహానటిలో అద్భుత పనితనం చూపిన వీళ్లిద్దరినీ ప్రభాస్‌తో చేయబోయే భారీ చిత్రానికి కూడా ఎంచుకున్నాడు అశ్విన్. ఈ విషయాన్ని వెల్లడిస్తూ అతను చేసిన కామెంట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. మహానటితో గతం తాలూకు కథను వెండితెరపైకి తెచ్చామని.. ఈసారి భవిష్యత్తులోకి ప్రయాణించబోతున్నామని అతను వ్యాఖ్యానించాడు.
దీన్ని బట్టి ప్రభాస్‌తో అతను చేయబోయేది సైంటిఫిక్ థ్రిల్లరే అని.. ఆదిత్య 369లో మాదిరే ఇందులోనూ భవిష్యత్‌లోకి ప్రయాణం ఉంటుందని స్పష్టమవుతోంది. ఇలాంటి కథలో ప్రభాస్ నటించడం అన్నది ఎంతో ఎగ్జైట్ చేసే విషయమే. మరి యంగ్ రెబల్ స్టార్‌ను అశ్విన్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయిక కాగా.. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర చేయనున్నాడు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించనున్నారు.
This post was last modified on January 30, 2021 10:41 am
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…