Movie News

తరుణ్ భాస్కర్ – ఈషా… క్లారిటీ వచ్చేసినట్లేనా?

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్.. కథానాయిక ఈషా రెబ్బా కలిసి ప్రయాణం సాగిస్తున్న విషయం ఎప్పుడో వెల్లడైంది. ఇంకా వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదన్న మాటే కానీ.. బలమైన బంధంలో ఉన్న సంగతి ఎప్పటికప్పుడు జనాలకు అర్థమవుతూనే ఉంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా తరుణ్.. ఈషాతో పెళ్లికి రెడీ అవుతున్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. వీళ్లిద్దరూ కలిసి కెమెరాలకు చాలాసార్లు చిక్కారు. తాజాగా తరుణ్ భాస్కర్ తల్లి గీతనే స్వయంగా ఈషా గురించి స్టేజ్ మీద గొప్పగా మాట్లాడడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకునే సంకేతాలు వచ్చేశాయి.

‘ఈఎన్ఈ రిపీట్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో గీత ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం జనం ఎంతగా డిమాండ్ చేశారు, తరుణ్ మీద ఎంత ప్రెజర్ పెట్టారు అన్నది ఆమె గుర్తు చేసుకున్నారు. రెండేళ్లుగా తరుణ్ ఈ సినిమా కోసమే కాక వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో కష్టపడ్డాడని.. అప్ అండ్ డౌన్స్ చూశాడని గీత చెప్పారు. ఒకవైపు ఈ సినిమా పనులు.. ఇంకో వైపు కోర్టు కేసులు.. మరోవైపు ఇంటి నిర్మాణం.. ఇలా రేయింబవళ్లు శ్రమించాడని.. చాలాసార్లు ఇంటికి కూడా వచ్చేవాడు కాదని.. తెల్లవారుజామున తినేవాడని ఆమె అన్నారు.

ఇంత కష్టంలో తరుణ్‌కు పెద్ద సపోర్ట్ ఇచ్చింది ఈషానే అంటూ ఆమె కొనియాడారు. తనకు వయసు అయిపోతోందని, తన తర్వాత కొడుకును ఎవరు చూసుకుంటారు అనే బెంగ ఉండేదని.. ఈషా రాకతో తనకు ఆ బెంగ పోయిందని ఆమె అన్నారు. పిల్లలు ఒక దశ దాటాక తల్లిదండ్రులతో పాటు స్నేహితులతో కూడా అన్ని విషయాలూ చెప్పుకోలేరని.. కచ్చితంగా ఒక పార్ట్‌నర్ ఉండాలని ఆమె అన్నారు. గీత ఈ కామెంట్ చేయడంతో తరుణ్‌కు ఈషా లైఫ్ పార్ట్‌నర్ లాంటిదే అని క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇక ఈ ఇద్దరూ అధికారికంగా వివాహ బంధంలోకి అడుగు పెట్టడం మాత్రమే మిగిలి ఉందన్నది స్పష్టం.

This post was last modified on November 18, 2026 11:49 am

Share

Recent Posts

రామాయణ మేనియా.. థియేటర్లలో నాన్‌వెజ్‌కు బ్రేక్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన పౌరాణిక చిత్రం 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' ఇప్పుడు థియేటర్లలో…

1 hour ago

బండ్ల గణేష్ కు జైలు శిక్ష

టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్…

2 hours ago

‘శ‌బ‌రిమ‌ల‌ను తిరుమ‌ల చేస్తా’: సీఎం ప్ర‌క‌ట‌న.. సాధ్య‌మేనా?!

కొన్ని కొన్ని ప్ర‌క‌ట‌న‌లు విని ఊరుకోవాల్సిందే!. కానీ, నాయ‌కులు మాత్రం ఊద‌ర‌గొడుతూనే ఉంటారు. తాజాగా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత శ‌బ‌రిమ‌ల ఆల‌యాన్ని…

3 hours ago

లక్కీగా రేవంత్ సీఎం అయ్యారు: రాజగోపాల్ రెడ్డి

తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ అధిష్టానం మాట తప్పిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే గతంలో…

4 hours ago

ఈ విష‌యంలో మోడీని మెచ్చేసుకున్నారు!

అన్ని విష‌యాల్లోనూ కాక‌పోయినా.. కొన్ని కొన్నివిష‌యాల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చూపే చొర‌వ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. తాజాగా ఫిలిప్పీన్స్ రాజ‌ధాని…

5 hours ago

‘వాళ్లంతా మూర్ఖులు.. వారికి సైన్స్ తెలీదు’

కేర‌ళ రాష్ట్రానికి చెందిన న‌టుడు, ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న సురేష్ గోపి త‌న నోటికి ప‌ని చెప్పారు. బీజేపీ…

5 hours ago