సస్పెన్సుకు తెరదించుతూ అక్టోబరు 13న ‘ఆర్ఆర్ఆర్’ను రిలీజ్ చేయాలని నిర్ణయించింది జక్కన్న అండ్ టీం. దీని గురించి ఘనంగా ప్రకటన చేశారు. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చిన నేపథ్యంలో ఈసారి మాత్రం పక్కాగా ఆ తేదీకే సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే ఈ సినిమాకు దసరా వీకెండ్‌ను ఎంచుకోవడం ఓ బాలీవుడ్ అగ్ర నిర్మాతకు అస్సలు రుచించలేదు. ఆయనెవరో కాదు.. శ్రీదేవి భర్త బోనీకపూర్.
ప్రస్తుతం తెలుగులో దిల్ రాజుతో కలిసి ‘వకీల్ సాబ్’ను నిర్మిస్తున్న బోనీ.. హిందీలో ‘మైదాన్’ అనే భారీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. అమిత్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలీవుడ్లో సినిమా మొదలైనపుడే రిలీజ్ డేట్ ఖరారు చేస్తుంటారు. ‘మైదాన్’కు కూడా అలాగే అక్టోబరు 15ను విడుదల తేదీగా ఎంచుకున్నారు.
ఐతే ఆ విషయం తెలిసీ ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ను దసరా వీకెండ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయించడం పట్ల బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా ఎనలేని పేరు సంపాదించిన రాజమౌళి నుంచి తర్వాత రాబోయే సినిమాకు హాలిడే వీకెండ్ అవసరం లేదని, ఏ డేట్ ఎంచుకున్నా పర్వాలేదని.. తమ సినిమా దసరా వీకెండ్లో రాబోతోందని తెలిసి కూడా ‘ఆర్ఆర్ఆర్’ను దానికి పోటీగా నిలపడమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక్కడో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో కీలక పాత్ర పోషిస్తున్న అజయ్ దేవగణే ‘మైదాన్’లో హీరో. ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకేసారి పోటీ పడటం కూడా సరి కాదని బోనీ అభిప్రాయం.
పైగా ‘మైదాన్’ అజయ్ హీరోగా నటించిన చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’ వల్ల దానికి ఇబ్బంది ఎదురైతే అజయ్ ఎలా ఊరుకుంటాడని బోనీ ఉద్దేశం. అజయ్‌కు తెలియకుండానే ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ డేట్ ఇచ్చి ఉంటుందని, దీనిపై అతను కినుక వహించాడని, అందుకే ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ గురించి ట్విట్టర్లో పోస్ట్ కూడా పెట్టలేదని అంటున్నారు.
This post was last modified on January 27, 2021 11:11 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…