థియేటర్లలో రిలీజైన సినిమా టీవీల్లోకి రావడానికి ఒకప్పుడు సంవత్సరాలు పట్టేది. తర్వాత ఆ వ్యవధి నెలలకు తగ్గింది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పుణ్యమా అని విడుదలైన కొన్ని రోజుల్లోనే టీవీల్లో చూసే అవకాశం దక్కింది. కరోనా ప్రభావం వల్ల థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీల్లోనే కొత్త సినిమాలు విడుదలయ్యే ఒరవడి కూడా వచ్చింది.
ఐతే ఆ విరామం తర్వాత థియేటర్లు మళ్లీ తెరుచుకుని కొత్త సినిమాలు అక్కడ రిలీజవుతుండటంతో.. అక్కడి నుంచి ఓటీటీల్లోకి అవి ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు ప్రేక్షకులు. సంక్రాంతి సినిమాల్లో ఇప్పటికే క్రాక్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ముందు జనవరి 29 అనుకున్నది కాస్తా.. ఫిబ్రవరి 5కు వాయిదా పడింది. థియేటర్లలో ఇంకా ఈ సినిమా బాగా ఆడుతుండటమే అందుక్కారణం.
కాగా ఇప్పుడు మరో సంక్రాంతి క్రేజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఆ చిత్రమే.. మాస్టర్. భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 13న విడుదలైన ఈ సినిమా.. రెండు వారాలకే అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ నెల 28న రాత్రి 10.15 గంటలకు ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
తెలుగులో ఈ సినిమా జోరు తగ్గిపోయింది కానీ.. తమిళంలో బాగానే ఆడుతోంది. ఈ వీకెండ్లోనూ మంచి వసూళ్లే వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ ఈలోపే ప్రైమ్ ద్వారా మాస్టర్‌ను రిలీజ్ చేసేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. బహుశా ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం ఇలా రిలీజ్ చేయాల్సి వస్తుండొచ్చు. అందుకోసం భారీ మొత్తంలో పుచ్చుకుని ఉండొచ్చు. థియేట్రికల్ రిలీజ్‌లో డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందో చూడాలి.
This post was last modified on January 27, 2021 10:11 am
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…