Movie News

చెల్లెలు శ్రీలీలతో నాగవంశికి గొడవలు

పుట్టి పెరిగింది కర్ణాటకలో అయినా.. క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది కూడా కన్నడ ఇండస్ట్రీలోనే అయినా.. శ్రీలీల అచ్చమైన తెలుగమ్మాయే. ‘పెళ్ళిసంద-డి’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ బ్యూటీ.. ఆ సినిమాతో మంచి పేరు సంపాదించి తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోయింది. చూస్తుండగానే టాప్ హీరోయిన్ అయిపోయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసింది. కానీ వరుసగా ఫెయిల్యూర్లు రావడం.. తన యాక్టింగ్ మీద విమర్శలు రావడంతో కెరీర్ తిరోగమన బాట ప‌ట్టింది.

ఈ ఏడాది ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ త‌ర్వాత శ్రీలీల‌కు తెలుగులో సినిమానే లేదు. కానీ ఇదే స‌మ‌యంలో త‌మిళంలో త‌న కెరీర్ పుంజుకుంటోంది. ప‌రాశ‌క్తితో మంచి పేరు సంపాదించిన ఆమె.. ఈ శుక్ర‌వారం ఓం సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతోంది. అలాగే అజిత్ స‌ర‌స‌న డేర్ డెవిల్ మూవీ, రజనీతో ధర్మన్ కూడా చేయ‌బోతోంది. ఓం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం సోమ‌వారం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన శ్రీలీల‌.. కెరీర్లో తాను చేసిన పొర‌పాట్ల గురించి ఈ ఈవెంట్లో మాట్లాడ్డం విశేషం.

“ఇండస్ట్రీలో నా జర్నీ మీకు తెలుసు. చిన్నప్పుడే సినిమాల్లోకి వచ్చాను. ఆ టైంలో నా దగ్గరికి వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకుని చేస్తూ పోయాను. ఫ్లోలో వెళ్ళిపోయాను. అయినా మీరు ప్రేమ చూపించారు. ఆదరించారు. అంతకంటే ఆనందపడేది లేదు. కానీ నాకు కొంచెం టైం దొరికినప్పుడు నేను ఆలోచించాను. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఏం జరుగుతోంది అని. మనం సొంతంగా నిర్ణయాలు తీసుకున్నపుడు, మనకు మనం దేన్నయినా ఎంచుకున్నపుడే మన జీవితం బాగుంటుందని అర్థమైంది” అని శ్రీలీల వివరించింది.

దీన్ని బట్టి చూస్తే ఇంతకుముందు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పేసుకుని సినిమాలు చెయ్యడం వల్ల తప్పు జరిగిందని శ్రీలీల చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇప్పుడు సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు ఆమె సంకేతాలు ఇచ్చింది

మరోవైపు ఈ ఈవెంటుకి అతిథిగా వచ్చిన నిర్మాత నాగవంశీ.. శ్రీలీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు, తన చెల్లి శ్రీలీలకు గొడవలు ఎక్కువైపోయి సినిమాలు తగ్గిపోయాయన్నాడు. కానీ సాయి అభ్యంకర్ బర్త్ డేకి వచ్చిన గ్లింప్స్ అదిరిపోయిందని, మేకప్ లేకుండా శ్రీలీల అదిరిపోయిందని అందరికీ చెప్పానని నాగవంశీ వ్యాఖ్యానించాడు.

నాగవంశీ నిర్మించిన కింగ్డమ్, లెనిన్ చిత్రాల్లో మొదట తీసుకుంది శ్రీలీలలే. తర్వాత ఏం జరిగిందో ఏమో, రెండు సినిమాల్లో వేరే హీరోయిన్లు రావడం జరిగిన విషయం ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చింది.

This post was last modified on November 16, 2026 11:19 pm

Share

Recent Posts

నెల్సన్ తొలి సినిమా ఉన్న లాప్ ట్యాప్ ఎవడో లేపేసాడు

నెల్సన్ దిలీప్ కుమార్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో అతను తీసిన…

5 hours ago

17 ఏళ్లుగా జైల్లో ఉన్నారు… ఇక ఇంటికి పంపేయ‌చ్చు

``దాదాపు 17 ఏళ్ల‌కుపైగానే దోషులు జైల్లో ఉన్నారు. ఇక‌, చాలు. వారిని ఇంటికి పంపేయొచ్చు.`` అని 2002 నాటి బిల్కిస్…

6 hours ago

కూతురిని స్టేజ్ మీదికి రానివ్వ‌ని రేణు దేశాయ్

సీనియ‌ర్ న‌టి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా రోజుల త‌ర్వాత ఒక సినిమాలో క‌నిపించ‌బోతున్నారు. ఆ…

6 hours ago

బుట్టబొమ్మను బీట్ చేసిన రాను బొంబాయికి రాను

తెలుగు సంగీత ప్రపంచంలో సినిమా పాటలకే కాదు.. జానపద గీతాలకు కూడా భారీ ఆదరణ లభిస్తోందని మరోసారి ప్రూవ్ అయ్యింది.…

6 hours ago

రావిపూడి రేంజ్ ఏమిటో అర్థమయ్యిందిగా

తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీ, రీజనబుల్ బడ్జెట్ లో అత్యధిక రిటర్న్స్ తెచ్చిపెట్టగల దర్శకులు ఎవరయ్యా అంటే టాలీవుడ్ మొత్తం…

7 hours ago

ఫొటోలు: ఆధ్యాత్మిక గురువుతో సౌత్ హీరోయిన్

తెలుగు, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మిర్నాళిని రవి పెళ్లి చేసుకుంది. మలేషియాకు చెందిన ఆధ్యాత్మిక గురువు…

8 hours ago