Movie News

ఇంతకీ తారక్ లైనప్ ఏంటి?

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి సినిమా గురించి నిన్న వచ్చిన ప్రకటన ఇటు సినీ రంగంలో, అటు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తారక్‌తో పాటు అతడి లీగ్ టాప్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా సినిమాల మాయలో పడి రీజనల్ సినిమాకు దూరం అయిపోయారని.. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే మామూలు ఎంటర్టైనర్స్ చేయట్లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్న సమయంలో ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి వచ్చిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది.

ఐతే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో తారక్ లైనప్ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు అతడి చేతిలో ఏయే సినిమాలున్నాయి.. ఏది ఎప్పుడు పట్టాలెక్కుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. అనే విషయాల్లో అభిమానులు కొంచెం అయోమయానికి గురవుతున్నారు. మరి తారక్ ఏ సినిమా ఎప్పుడు చేసే అవకాశముందో ఒకసారి చూద్దాం.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నాడు. అది రెండు భాగాలుగా తెరకెక్కే చిత్రం. మొదటి భాగం వచ్చే జూన్‌లో రిలీజవుతుంది. ఇప్పటికే బాగా ఆలస్యం అయిన ఈ సినిమాను ఇంకోసారి వాయిదా వేసే అవకాశాలు లేవు. అది ప్రస్తుతం దాని షూటింగ్ అనుకున్న ప్రకారమే జరుగుతోంది. షూట్ చివరి దశకు చేరుకుంది. ఇంకో మూడు నెలల్లో తారక్ ఈ సినిమాను పూర్తి చేస్తాడని సమాచారం. దీని తర్వాత తారక్ ‘గాడ్ ఆఫ్ వార్’ చేస్తాడని అంతా అనుకున్నారు.

కానీ తారక్ ఫోకస్ ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా మీదికి మళ్లింది. ‘డ్రాగన్’ తర్వాత మళ్లీ ఒక పాన్ ఇండియా సినిమాలోకి దూకితే.. తర్వాతి సినిమాకు చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అందుకే అనిల్ రావిపూడి సినిమాను తక్కువ టైంలో పూర్తి చేసి, ఆ తర్వాత ‘గాడ్ ఆఫ్ వార్’లోకి వెళ్లాలనుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని 2028 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని పూర్తి చేస్తూ.. చివరి దశలో ‘గాడ్ ఆఫ్ వార్’ను తారక్ మొదలుపెట్టే అవకాశముంది. ఇంతకుముందు అనుకున్న ‘దేవర-2’ను తారక్ సమీప భవిష్యత్తులో మొదలుపెట్టే సంకేతాలు కనిపించడం లేదు. ‘గాడ్ ఆఫ్ వార్’ చేశాక ‘డ్రాగన్-2’ను సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. కొన్ని రోజుల ముందు తారక్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ గురించి కూడా వార్తలు వచ్చాయి కానీ.. అది కూడా ఇప్పట్లో సాధ్యపడే సినిమాలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి తారక్ సినిమా లైనప్ మీద ఉన్న క్లారిటీ ఇది.

This post was last modified on November 15, 2026 6:03 pm

Share

Recent Posts

అంత్యక్రియల గురించి ముందే చెప్పిన గిరిబాబు

టాలీవుడ్ లెజెండరీ నటుల్లో ఒకరైన గిరిబాబు నిన్న అనాారోగ్యంతో చనిపోయారు. ఆయన వయసు 83 ఏళ్లు. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్…

10 minutes ago

జైల్లో తండ్రి… హైకోర్టు వెబ్ సైటును హాక్ చేసిన కొడుకు

సినిమాల్లో మాత్రమే కనిపించే తరహా ఘటన వాస్తవ జీవితంలో చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జైలులో ఉన్న తండ్రిని బయటకు…

27 minutes ago

బ్రిటిష్ పౌరసత్వం వచ్చినా… ఇక్కడ కేసులు పోవు లలిత్ మోదీ

ఒకప్పుడు భారత క్రికెట్‌లో లలిత్ మోదీ మాటకు ఎంతో విలువ ఉండేది. ఐపీఎల్‌ను ప్రారంభించి బీసీసీఐకి భారీ ఆదాయం వచ్చేలా…

3 hours ago

రమ్యకృష్ణ, కృష్ణవంశీ విడిపోలేదు కానీ..

లెజెండరీ డైరెక్టర్ కృష్ణవంశీ, సీనియర్ నటి రమ్యకృష్ణల వివాహ బంధం గురించి జనాలకు అనేక సందేహాలున్నాయి. వీళ్లిద్దరూ కలిసి జీవిస్తున్న…

3 hours ago

క్యాన్సర్ ఫైట్‌లో కొత్త టెక్నాలజీ.. 95 వేల ఖర్చు!

క్యాన్సర్ చికిత్సలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిశోధనలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. వ్యాధిని గుర్తించడం, కణితులను తొలగించడం, కీమోథెరపీ, రేడియేషన్…

4 hours ago

కీర్తి సురేష్‌కు మళ్ళీ సావిత్రి కలిసి వస్తుందా

మహానటి వచ్చి ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా సరే దాని ప్రభావం ఇండస్ట్రీ మీద ఇంకా చూస్తూనే ఉంటాం. ఆ…

5 hours ago