Movie News

తమిళ బాక్సాఫీస్ దగ్గర విడ్డూరం

హిందూ సంస్కృతి, పురాణాలు, దేవుళ్ల నేపథ్యంలో సినిమాలు తీస్తే తమిళ ప్రేక్షకులకు పెద్దగా పట్టదు అనే ఒక ముద్ర పడిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన చాలా సినిమాలు తమిళంలో మాత్రం సరిగా ఆడని దాఖలాలు చాలానే చూశాం. కానీ ‘రామాయణం’ సినిమా మాత్రం తమిళనాట బాగా ఆడుతుండడం విశేషం. ఈ చిత్రం రిలీజ్ ముంగిట తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేకపోయింది. 

తెలుగు రాష్ట్రాల్లో మాదిరి అక్కడ పెద్ద రిలీజ్ కూడా దక్కలేదు. సూర్య సినిమా ‘సీన్’కే పెద్ద పీట వేశారు. రిలీజ్ వీకెండ్లో సూర్య మూవీనే డామినేట్ చేసింది. ‘రామాయణం’ చిత్రానికి ఒక మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయంతే. కానీ తర్వాత పరిస్థితి మారిపోయింది. ‘సీన్’కు దీటుగా ‘రామాయణం’ నిలబడింది. రెండో వీకెండ్ వచ్చేసరికి ‘సీన్’ వెనక్కి వెళ్లిపోయి.. ‘రామాయణం’ తమిళ బాక్సాఫీస్‌లో నంబర్ వన్ సినిమాగా నిలుస్తుండడం విశేషం. రామాయణం సినిమాకు తమిళులు ఇంతగా కనెక్ట్ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ‘రామాయణం’ మీద ప్రేమతోనో, రాముడి మీద భక్తితోనో తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారనుకుంటే పొరపాటే. అలాంటి ప్రేక్షకులు ఉండొచ్చు కానీ.. వారి సంఖ్య తక్కువ. అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నది రావణుడి పాత్రకు అన్నది విశ్లేషకుల మాట.

ముందు నుంచి తమిళులు రామాయణంలో రాముడి కంటే రావణుడి పాత్రకే ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. రాముడిని వ్యతిరేకిస్తూ రావణుడికి ఎలివేషన్ ఇస్తుంటారు. రావణుడు ఉన్న లంకను తమిళులు బాగా ఓన్ చేసుకోవడం.. రావణుడి పాత్రను ప్రేమించడం ఎప్పట్నుంచో ఉన్న ట్రెండే.

మణిరత్నం అంతటివాడు కూడా రామాయణాన్ని మోడర్నైజ్ చేస్తూ తీసిన ‘రావణ్’ సినిమాలో విక్రమ్ చేసిన విలన్ పాత్రను హైలైట్ చేసి, రాముడిని పోలిన పృథ్వీరాజ్ క్యారెక్టర్ని నెగెటివ్‌గా చూపించడం గమనార్హం. ఇప్పుడు నితీశ్ తివారి ‘రామాయణం’లో రణబీర్ చేసిన రాముడి పాత్ర కంటే.. యశ్ చేసిన రావణుడి పాత్రే ఎలివేట్ అయింది. అందుకే ఈ సినిమాకు తమిళ ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యారన్నది స్పష్టం. అందుకే ‘రామాయణం’ సినిమా తమిళనాట అంచనాలను మించి ఆడుతూ.. పెద్ద రేంజికి వెళ్తోంది.

This post was last modified on November 14, 2026 6:23 pm

Share

Recent Posts

ఊహించని కాంబో… ఎన్టీఆర్ & రావిపూడి

ఎవరూ ఊహించని కాంబినేషన్ తెరకెక్కనుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్నట్టు తారక్ స్వయంగా…

1 hour ago

బహుముఖ ప్రజ్ఞాశాలి ‘గిరిబాబు’ ఇక లేరు

టాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అయిదు దశాబ్దాలకు పైగా కళారంగానికి ఎన్నో సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు…

2 hours ago

ఇకపై మీ పిల్లలను మీరే కనాలి

సంతానం కలగడం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత కల. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందడంతో పిల్లలు లేని దంపతులకు ఎన్నో మార్గాలు…

2 hours ago

విమ‌ర్శ‌లు త‌ట్టుకోలేని వారికి `ఆత్మ క‌థ` ఎందుకు?

బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా ఎదిగిన న‌టీమ‌ణి కంగ‌నా ర‌నౌత్‌పై హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పోలీసులు కేసు పెట్టారు. షిమ్లా…

4 hours ago

తిరుమ‌ల శ్రీవారిని`క‌ళ్ల‌కు క‌ట్టిన` చిత్ర‌కారుడు ఇక లేరు!

అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడు తిరుమ‌ల శ్రీవారిని ఈష‌ణ్మాత్రం ద‌ర్శించుకునేందుకు త‌హ‌త‌హ‌లాడిపోయే వారు ఎంద‌రో!. లిప్త‌కాలమే అయినా.. వైకుంఠ‌దాముడిని ద‌ర్శించుకుందామ‌ని అనేక వ్య‌య…

4 hours ago

గిగ్ వర్కర్లకు వైఫై.. రెస్ట్ జోన్లు కూడా!

ఆన్‌లైన్ ఫ్లాట్ ఫార్మ్ నుంచి వ‌చ్చే ఆర్డ‌ర్ల‌ను ఇంటికి చేర్చే గిగ్ వ‌ర్క‌ర్స్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో విప‌క్ష…

5 hours ago