ఎవరూ ఊహించని కాంబినేషన్ తెరకెక్కనుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్నట్టు తారక్ స్వయంగా తన అఫీషియల్ హ్యాండిల్ ద్వారా ప్రకటించాడు. సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం. నిజానికి దీనికి సంబంధించి ఎలాంటి లీక్ ఇప్పటిదాకా బయటికి రాలేదు. హఠాత్తుగా ఒక ఫోటో రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చేసరికి అభిమానులు ఆశ్చర్యం, ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఇది పూర్తి వినోదాత్మకంగా రూపొందనుంది. ట్వీట్ లో లాఫ్ రైట్ అంటే నవ్వుల పండగ అని హింట్ ఇచ్చేశారు కాబట్టి ఎలాంటి ఎలివేషన్లు, బిల్డప్స్ లేకుండా అదుర్స్ తరహాలో మంచి ఎంటర్ టైనర్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం డ్రాగన్ పూర్తి చేసే పనిలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నీ సీరియస్ సినిమాలు చేస్తుండటంతో బ్రేక్ కోసం ఇలా రూటు మార్చడం చాలా మంచి నిర్ణయం. వేగానికి మారుపేరైన రావిపూడి 2028 సంక్రాంతికి ఈ కాంబోని థియేటర్లలో చూపించడం ఖాయమే.
నిన్న ప్రెస్ మీట్ లో దిల్ రాజు తమతో రావిపూడి సినిమా ఉంటుందని చెప్పిన ఒక్క రోజులోనే ఈ పరిణామం జరగడం గమనించాల్సిన విషయం. అంటే అది వేరే ప్రాజెక్టనే క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి కలయిక ఉండొచ్చని పుకార్లు షికారు చేస్తున్న టైంలో ఇలా బాంబు పేల్చడం ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. క్యాస్టింగ్ తదితర వివరాలు ఇంకా ఫైనల్ చేయలేదు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ జనవరి 12 విడుదల హడావిడి పూర్తిగా అయిపోయాక మరిన్ని డీటెయిల్స్ వస్తాయి.
తొలిసారి కలయిక కావడంతో ఈ ప్రాజెక్టు పట్ల ఫ్యాన్స్ లో మంచి ఎగ్జైట్ మెంట్ అయితే ఉంటుంది. బాబాయ్ బాలకృష్ణని భగవంత్ కేసరిని చాలా బాగా డీల్ చేసిన రావిపూడి ఈసారి అబ్బాయిని ఎలా చూపిస్తాడోననే ఉత్సాహం సహజంగానే సినీ ప్రియుల్లో ఉంటుంది. తారక్ ని ఫుల్ ఎనర్జీలో చూసి చాలా కాలమయ్యింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు, 2028 సంక్రాంతికి వస్తుందా లేక ఈసారి సీజన్ మిస్ చేసుకుని వేరే డేట్ వైపు చూస్తారా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులైతే వెయిట్ చేయాలి.
This post was last modified on November 14, 2026 5:16 pm
టాలీవుడ్ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. అయిదు దశాబ్దాలకు పైగా కళారంగానికి ఎన్నో సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి గిరిబాబు…
బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఎదిగిన నటీమణి కంగనా రనౌత్‌పై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు. షిమ్లా…
ఆన్‌లైన్ ఫ్లాట్ ఫార్మ్ నుంచి వచ్చే ఆర్డర్లను ఇంటికి చేర్చే గిగ్ వర్కర్స్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష…
తణుకు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, బలగం రాజ్‌కుమార్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు…
దేశంలో నిన్న మొన్నటి వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్), కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా…
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 డిసెంబర్ లో ఆమె…