Movie News

22 కేజీలు కరిగించేసిన కీరవాణి

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని గుర్తు చేసుకోగానే భారీ అవతారం కళ్ల ముందు కదలాడుతుంది. సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఆయనది బొద్దు అవతారమే. వయసు పెరిగే కొద్దీ మనిషి ఇంకా భారీగా తయారవుతూ వచ్చారు తప్ప.. ఎప్పుడూ ఫిట్‌నెస్ గురించి పెద్దగా ఆలోచించింది లేదు.

తాను భోజన ప్రియుడినని చెప్పుకునే కీరవాణి నచ్చింది తింటారు తప్పితే నోరు కట్టుకోరని సన్నిహితులు చెబుతారు. ఐతే కొంచెం లేటుగా ఆయన ఆలోచన మారింది. నోటికి కళ్లెమే వేశారో.. లేదా కసరత్తులే చేశారో కానీ.. ఉన్నట్లుండి అవతారం మార్చేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చారు. 

ఒక్కసారిగా 22 కిలోల బరువు తగ్గి తేలికగా మారిన కీరవాణిని చూసి అందరూ అవాక్కవుతున్నారిప్పుడు. కీరవాణిలో వచ్చిన ఈ మేకోవర్ గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో వెల్లడించారు. బిఫోర్, ఆఫ్టర్ అంటూ కీరవాణికి సంబంధించి పాత, కొత్త ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన అనుపమ్.. ఈ లెజెండరీ సంగీత దర్శకుడిలో వచ్చిన మార్పు స్ఫూర్తిదాయకమంటూ కొనియాడారు. దీంతో కీరవాణిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మరి ఇంత కాలం లేనిది ఉన్నట్లుండి ఆయనలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

కీరవాణి ఇకపై రేయింబవళ్లు పని చేయాల్సిన స్థితిలో ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదలకు షెడ్యూల్ అయిన ‘వారణాసి’ కోసం ఆయన పని చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాటల పని ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. రష్ మొత్తం త్వరలోనే కీరవాణి చేతికి రానున్న నేపథ్యంలో ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పని చేయాల్సి ఉంది. ఈ సినిమాపై గ్లోబల్ ఆడియన్స్ దృష్టి నిలిచి ఉన్న నేపథ్యంలో కీరవాణి కెరీర్ బెస్ట్ ఇచ్చి తనేంటో ప్రపంచానికి చాటాల్సిన అవసరముంది. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న నేపథ్యంలో కీరవాణిపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పేదేముంది?

This post was last modified on November 13, 2026 3:50 pm

Share

Recent Posts

ఒక్క పరుగుతో తప్పిన చెత్త రికార్డు!

న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 244 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ ఓటమితో…

18 minutes ago

బాబు విజన్‌కు ఫిదా.. పెట్టుబడులకు క్యూ కట్టిన దేశాలు

విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న 31వ సీఐఐ-ఏపీ భాగ‌స్వామ్య పెట్టుబ‌డుల స‌ద‌స్సులో భారీగా పెట్టుబ‌డులు త‌ర‌లి వ‌చ్చా యి. ఇదేస‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబుకు…

39 minutes ago

హఠాత్తుగా సజ్జనార్ బదిలీ ఎందుకు?

వీసీ సజ్జనార్ ఐపీఎస్..ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. 2008లో వరంగల్ ఎస్పీగా సజ్జనార్ పనిచేస్తున్నప్పుడు యాసిడ్ దాడికి…

56 minutes ago

పెట్టుబడిదారులకు కావాల్సింది అదే.. చంద్రబాబు క్లారిటీ

ఏపీలో పెట్టుబ‌డులు వెల్లువెత్తుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. విశాఖ‌లో జ‌రుగుతున్న సీఐఐ పారిశ్రామిక స‌ద‌స్సు రెండో రోజు ఆయ‌న చాలా…

1 hour ago

హ్యాట్రిక్ హీరో… వాట్ నెక్స్ట్?

పదేళ్లకు పైగా సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ స్టార్ హీరో సూర్య.. కేవలం ఆరు నెలల వ్యవధిలో…

1 hour ago

2018 టాంపరింగ్ గొడవ… వార్నర్ ఒకవైపు, కమిన్స్ మరోవైపు!

ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ వివాదం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మొదలైంది. 2018లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాజీ…

3 hours ago