2026 ఒకే సంవత్సరంలో యష్ కు రెండు విభిన్నమైన ఫలితాలు దక్కాయి. టాక్సిక్ దారుణంగా డిజాస్టర్ కావడమే కాకుండా కంటెంట్ పరంగా చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. మార్నింగ్ షోకే చేతులు ఎత్తేసినప్పటికీ కేవలం యష్ ఇమేజ్ కారణంగా మూడంకెల వసూళ్లు సాధ్యమయ్యాయి. లెక్కల సంగతి ఎలా ఉన్నా ఈ దశాబ్దపు బ్యాడ్ మూవీస్ లో ఒకటిగా చోటు సంపాదించుకుంది. ఇప్పటికేదాకా దక్షిణాది భాషల్లో ఓటిటి స్ట్రీమింగ్ జరగలేదంటే కొనడానికి కంపెనీలు ఎంత భయపడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
అయితే రామాయణ ఈ గాయాన్ని కొంత మేర తగ్గించింది. రావణుడిగా యష్ పెర్ఫార్మన్స్ కి మంచి ప్రశంసలు దక్కాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల రన్బీర్ కపూర్ ని సైడ్ చేసేంతగా మెప్పించాడు. రెండో భాగం రామాయణ పార్ట్ 2 ఇంకో రెండేళ్ల తర్వాత వస్తుంది. షూటింగ్ సగానికి పైగా అయిపోయిందట కానీ ఇంకొంత కాలం కాల్ షీట్లు అవసరం పడేలా ఉన్నాయి. మరి అప్పటిదాకా యష్ వెయిట్ చేస్తూ ఉంటే విలువైన సమయం వృధా అయిపోతుందనేది అభిమానుల డౌట్.
దానికి తగ్గట్టే యష్ కొత్త సినిమా కసరత్తు చేస్తున్నాడని బెంగళూరు వర్గాల టాక్. పలువురు దర్శకులు కలుస్తున్నారు కానీ ఇంకా ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిసింది. సర్దార్ ఫేమ్ పీఎస్ మిత్రన్ ఒక అడ్వెంచర్ స్టోరీ యష్ కోసమే రాసుకున్నాడు. ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో క్లూ ఇచ్చాడు. అయితే సర్దార్ 2 ఘోరంగా దెబ్బ తినడంతో ఇప్పుడీ కాంబో మీద అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఇంకో శాండల్ వుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్.
ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నది మరొకటి ఉంది. అదే కెజిఎఫ్ 3. కానీ ప్రశాంత్ నీల్ దొరికేలా లేడు. జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ రెండు భాగాలు రిలీజయ్యేనాటికి 2028 అయిపోయేలా ఉంది. అటుపక్క ప్రభాస్ సలార్ 2 శౌర్యంగపర్వం చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నీల్ ప్రత్యేకంగా కెజిఎఫ్ 3 మీద పని చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకే యష్ ప్యాన్ ఇండియా మోజు నుంచి బయటికి వచ్చి వేగంగా అయిపోయే ఏదైనా యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలని మూవీ లవర్స్ కోరిక.
This post was last modified on November 13, 2026 3:46 pm
2027 సంక్రాంతి సీజన్‌కు ఇంకో రెండు నెలల సమయమే ఉంది. కానీ ఇప్పటికీ పండగ సినిమాల మీద పూర్తి స్పష్టత…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని గుర్తు చేసుకోగానే భారీ అవతారం కళ్ల ముందు కదలాడుతుంది. సంగీత దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన…
న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 244 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ ఓటమితో…
విశాఖలో నిర్వహిస్తున్న 31వ సీఐఐ-ఏపీ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సులో భారీగా పెట్టుబడులు తరలి వచ్చా యి. ఇదేసమయంలో సీఎం చంద్రబాబుకు…
వీసీ సజ్జనార్ ఐపీఎస్..ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. 2008లో వరంగల్ ఎస్పీగా సజ్జనార్ పనిచేస్తున్నప్పుడు యాసిడ్ దాడికి…
ఏపీలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ పారిశ్రామిక సదస్సు రెండో రోజు ఆయన చాలా…