విశ్వంభర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఆర్టిస్ట్ ప్రవీణ్ నిన్న షేర్ చేసిన ఫోటో వైరలయ్యింది. ఇంకోవైపు కొత్త ట్రైలర్ సిద్ధమయ్యిందని విశ్వాసనీయ సమాచారం. ఇంకో వైపు కాకా పాట షూటింగ్ శేఖర్ మాస్టర్ నేతృత్వంలో హైదరాబాద్ లో తీస్తున్నారు. దర్శకుడు బాబీ కొల్లి రాజీ పడే సమస్యే లేదన్న తరహాలో దూకుడు చూపిస్తున్నారు. దానికి మెగాస్టార్ సహకారం కూడా పుష్కలంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా బిజినెస్ దాదాపు పూర్తయ్యిందని ట్రేడ్ టాక్.
అసలు జనవరిలో ఈ రెండింటిలో పక్కాగా ఏది వస్తుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కేవలం వారం పది రోజుల గ్యాప్ లో రెండూ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది. అది జరగకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మెగాస్టార్ రెండు మూవీస్ ఒకే సీజన్ లో రావడం వల్ల ఏదో ఒకటి నష్టపోతుంది. పైగా పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి థియేటర్లు దొరకడం సులభంగా ఉండదు. అది కూడా అనిల్ రావిపూడి లాంటి బలమైన కాంపిటీటర్లను పెట్టుకుంది.
ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవి మౌనాన్ని ఆశ్రయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవలే జరిగిన మెగావర్స్ నాగార్జున ఎపిసోడ్ లో కొందరు ఫ్యాన్స్ గ్యాలరీ నుంచి విశ్వంభర అని అరిస్తే చిరు నుంచి ఎలాంటి స్పందన రాలేదట. అంటే ఆయనకు సైతం క్లారిటీ లేదనేది ఒక కామెంట్. ఒకప్పుడు నాని, బాలకృష్ణలు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసుకున్న రికార్డు సొంతం చేసుకున్నారు. చిరు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉన్నట్టు మెగా వర్గాల టాక్.
ఏది ఏమైనా వీలైనంత త్వరగా దీనికి చెక్ పెట్టడం అవసరం. కొన్ని హ్యాండిల్స్ జనవరి 9 విశ్వంభర వస్తుందంటూ ట్వీట్లు చేస్తుండగా మరికొందరు కాకా బిజినెస్ నెంబర్లను రివీల్ చేసి అంచనాలు పెంచేస్తున్నారు. వీలైనంత త్వరగా చిరంజీవి వైపు క్లారిటీ వచ్చి రెండు సినిమాల నిర్మాతల ఉద్దేశాలేమిటో కనుక్కుంటే బెటర్. లేదంటే ఇలాంటి ప్రచారాలు జనం మధ్య తిరుగుతూనే ఉంటాయి. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మొదలు పెట్టాలంటే దర్శకుడు వసిష్ఠ ముందు విశ్వంభర నుంచి విముక్ధుడు కావాలి.
This post was last modified on November 12, 2026 6:09 pm
వైసీపీ నేతల నోటి నుంచి వినిపిస్తున్న ఏకైక మాట పాదయాత్ర. వచ్చే ఏడాదిలో జగన్ 2.0 పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారన్నది…
టాలీవుడ్లో ఎన్నో ఘనమైన అరంగేట్రాలు జరిగాయి. ఐతే ఇప్పుడు ఒక వ్యాపార కుటుంబానికి చెందిన కుర్రాడి విషయంలో.. పెద్ద సినీ…
ఈ మధ్య చిన్న సినిమాలకు వివాదాలే ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి. ఇడుపు కాయితం అనే చిన్న సినిమా విషయంలో ఇలాగే…
ఏపీలో కియా రెండో ప్లాంట్ విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. నవంబర్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి.. నిన్న మొన్నటి వరకు జాతీయ మీడియా వాటర్ మ్యాన్ అంటూ.. ప్రశంసలు…
ఏపీలో ఇప్పటికే ఫలితాలు వెల్లడైన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి పార్టీలు విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. అయితే,…