తన ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు శర్వానంద్. ఈ ఊపులో అతను ‘భోగి’ లాంటి ఊర మాస్ మూవీని లైన్లో పెట్టాడు. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని రూపొందించాడు. శర్వా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించాడు సీనియర్ నిర్మాత కె.కె.రాధా మోహన్. ఆగస్టు 28నే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అప్పటికి సినిమా రెడీ చేయలేకపోయారు.
ఇంకో రెండున్నర నెలలు టైం తీసుకుని, నవంబరు 12న ‘భోగి’ని రిలీజ్ చేయడానికి ముహూర్తం పెట్టుకున్నారు. కొన్ని రోజుల ముందు వరకు ఈ సినిమా విడుదలకు రేసులోనే ఉంది. కానీ తర్వాత కథ మారిపోయింది. సినిమా సెన్సార్ రివైజ్డ్ కమిటీకి వెళ్లడంతో రిలీజ్ ఆగిపోయింది. నిన్ననే వాయిదా గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు. కానీ కొత్త డేట్ మాత్రం చెప్పలేదు. మరి ఈ సినిమాకు నెక్స్ట్ రిలీజ్ ఆప్షన్ ఎక్కడ అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
ఈ నెలలో చివరి రెండు వారాల్లో కూడా ‘భోగి’ని రిలీజ్ చేయడం కష్టమే. నవంబరు 19న ‘ఈఎన్ఈ రిపీట్’, 20న ‘ఆకాశంలో ఒకతార’ లాంటి క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి. తమిళ అనువాదం ‘ఓం’ కూడా రాబోతోంది. నెలాఖర్లో ‘మైసా, హైందవ సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. డిసెంబరు తొలి వారంలోనేమో ‘వృషకర్మ’తో పాటు కొన్ని చిత్రాలు.. 11న అరడజను సినిమాల దాకా రాబోతున్నాయి. క్రిస్మస్ వీకెండ్లో కూడా రష్ గట్టిగా ఉంది. అసలక్కడ స్కోపే లేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘భోగి’ని రిలీజ్ చేయడానికి కాస్త అవకాశం
కనిపిస్తున్నది డిసెంబరు మూడో వారంలో మాత్రమే. ముందు, తర్వాతి వారాల్లో క్రేజీ సినిమాలు రిలీజవుతుండడంతో ఆ వీకెండ్‌ను కాస్త ఖాళీగా వదిలారు. ఆ వీకెండ్‌కే తాజాగా అల్లరి నరేష్ సినిమా ‘ఆల్కహాల్’ షెడ్యూల్ అయింది. వేరే వీకెండ్లలో క్రేజీ చిత్రాలతో పోటీ పడడమా.. లేక క్రేజ్ లేని వీకెండ్లో తక్కువ పోటీ మధ్య రావడమా అన్నది ‘భోగి’ చూసుకోవాల్సి ఉంది. సంక్రాంతికి శర్వా మరో సినిమా ‘జార్జి క్రిష్’ రానున్న నేపథ్యంలో ‘భోగి’ని మరీ లేట్ చేయడానికి కూడా అవకాశం లేదు. మరి సంపత్ నంది అండ్ టీం ఏ ఆప్షన్ తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on November 12, 2026 5:30 pm
విశ్వంభర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఆర్టిస్ట్ ప్రవీణ్ నిన్న షేర్ చేసిన ఫోటో వైరలయ్యింది. ఇంకోవైపు కొత్త ట్రైలర్ సిద్ధమయ్యిందని…
వైసీపీ నేతల నోటి నుంచి వినిపిస్తున్న ఏకైక మాట పాదయాత్ర. వచ్చే ఏడాదిలో జగన్ 2.0 పేరుతో పాదయాత్ర ప్రారంభించనున్నారన్నది…
టాలీవుడ్లో ఎన్నో ఘనమైన అరంగేట్రాలు జరిగాయి. ఐతే ఇప్పుడు ఒక వ్యాపార కుటుంబానికి చెందిన కుర్రాడి విషయంలో.. పెద్ద సినీ…
ఈ మధ్య చిన్న సినిమాలకు వివాదాలే ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి. ఇడుపు కాయితం అనే చిన్న సినిమా విషయంలో ఇలాగే…
ఏపీలో కియా రెండో ప్లాంట్ విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతోంది. నవంబర్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురించి.. నిన్న మొన్నటి వరకు జాతీయ మీడియా వాటర్ మ్యాన్ అంటూ.. ప్రశంసలు…