సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా గతంలో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండానే రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. అతి తక్కువ గ్యాప్ లో దర్శకులు మారుతూ వెళ్లారు. అభిమానులు అయోమయానికి గురయ్యారు. స్క్రిప్ట్ దగ్గర ఏకాభిప్రాయం రాకపోవడం దగ్గరి నుంచి ప్రొడక్షన్ కాస్ట్ దాకా రకరకాల కారణాలు దీనికి దోహదం చేశాయి. ఫైనల్ గా సుందర్ సిని లాక్ చేసి ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు.
దాని తాలూకు వీడియో సోషల్ మీడియాలో విడుదల చేయడం అభిమానులకు గుర్తే. రజనితో గతంలో అరుణాచలం లాంటి బ్లాక్ బస్టర్ తీశారు కాబట్టి ఆ నమ్మకంతో ప్రాజెక్టు అప్పగించారు. అయితే ఆయన వివిధ కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత అశ్వత్ మరిముత్తు తీసుకొచ్చిన ధర్మన్ ఓకే అయిపోయి షూటింగ్ మొదలుపెట్టారు. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఇటీవలే విడుదలైన నయనతార మూకుతి అమ్మన్ 2 (తెలుగులో మహాశక్తి) దర్శకుడు సుందర్ సి కాబట్టి.
మహాశక్తికి యునానిమస్ గా నెగటివ్ టాక్ వచ్చేసింది. గ్రాఫిక్స్ హ్యాండిల్ చేసిన తీరు, క్యారెక్టరైజేషన్లు, తాతల కాలం నాటి కథా కథనాలు వెరసి థియేటర్ కొచ్చిన ప్రేక్షకుల సహనంతో ఆడుకున్నాయి. మన దగ్గర నయన్ కు భీకరమైన ఇమేజ్ లేదు కానీ తమిళనాడులో కూడా మహాశక్తి కలెక్షన్లు సోసోగా ఉన్నాయి. రివ్యూలు గట్టిగా తలంటాయి. పబ్లిక్ టాక్ కూడా అన్యాయంగా ఉంది. నయనతార వల్ల కాసిన్ని కోట్లు కనిపించాయి కానీ దీనికన్నా జైలర్ 2 బుకింగ్సే వేగంగా ఉండటం గమనార్హం.
అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. సుందర్ సి తాము ఇచ్చిన బాధ్యతను హ్యాండిల్ చేయలేడని గుర్తించిన రజని కమల్ తెలివిగా అతన్ని వద్దనుకున్నారు. ఇప్పుడు దానికి క్లారిటీ మహాశక్తి రూపంలో వచ్చేసింది. హారర్ కామెడీ జానర్ లో రొటీన్ సినిమాలు చేసుకునే సుందర్ ఇంత పెద్ద గ్రాండియర్ ని డీల్ చేయడంలో తడబడ్డారు. విఎఫ్ఎక్స్ ఎంత దారుణంగా ఉందంటే ట్రోలింగ్ బ్యాచులు పండగ చేసుకుంటున్నాయి. చూస్తుంటే సుందర్ ని ఇప్పట్లో పెద్ద హీరోలు నమ్మేలా కనిపించడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates