నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ అందించిన జోడీ విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది. ఐతే ఆ చిత్రాలకు త్రివిక్రమ్ రచన మాత్రమే చేశారు. ఈసారి వెంకీని ఆయన డైరెక్ట్ చేస్తున్నాడనగానే రెండేళ్ల ముందు వీళ్లిద్దరి అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. కానీ వీరి కలయికలో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ అంచనాలకు చాలా దూరంలో ఆగిపోయింది. గత వారం విడుదలైన ఈ సినిమా వీకెండ్ వరకు కొంచెం జోరు చూపించి.. ఆ తర్వాత చల్లబడిపోయింది.
క్రేజీ కాంబినేషన్లో రూపొందిన సినిమా అని ఈ సినిమాకు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి హక్కులు కొన్నారు వివిధ ఏరియాల బయ్యర్లు. కానీ వాళ్ల పెట్టుబడిలో సగం వస్తే గొప్ప అన్నట్లుంది పరిస్థితి. రూ.75 కోట్ల మేర ‘ఆదర్శ కుటుంబం’ థియేట్రికల్ బిజినెస్ చేస్తే.. అందులో సగం షేర్‌కు మించి వచ్చేలా కనిపించడం లేదు. వీకెండ్లో రూ.25 కోట్ల షేర్ తెచ్చుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. తర్వాత నామమాత్రంగా షేర్ రాబడుతోంది. రెండో వీకెండ్లో ఏదైనా మ్యాజిక్ జరిగి నష్టాలు తగ్గుతాయేమో అని బయ్యర్లు ఆశించారు. కానీ అలాంటి సంకేతాలేమీ కనిపించడం లేదు.
నిన్న రిలీజైన ‘రామాయణం’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగానే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. సీన్, సమ్మర్ హాలిడేస్ సినిమాల నుంచి కూడా పోటీ ఉంది. దీంతో ‘ఆదర్శ కుటుంబం’ను ప్రేక్షకులు పట్టించుకునేలా కనిపించడం లేదు. చిత్ర బృందం కూడా సినిమా మీద ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. వీకెండ్ తర్వాత చెప్పుకోదగ్గ ప్రమోషన్లే లేవు. సినిమాను రెండో వీకెండ్లో కొంత వరకైనా పుష్ చేస్తే వసూళ్లు వచ్చేవేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఎందుకో టీం సైలెంట్ అయిపోయింది. నష్టాల మీద అంచనాలతో బయ్యర్లకు సెటిల్మెంట్ చేయడానికే నిర్మాతలు రెడీ అయిపోయినట్లు కనిపిస్తోంది.
This post was last modified on November 6, 2026 2:57 pm
ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అత్యంత కీలకమైన రాజకీయ సమీకరణంగా మారింది. ఈ మూడు పార్టీలు కలిసి…
పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అదొక సంచలనమే. ముఖ్యంగా తన ఇంటర్వ్యూల్లో ఏదో ఒక సందర్భంలో…
వైసీపీ అధినేత జగన్ బాబాయి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం వేడుక చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో…
మురసు తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే. కుండపోత వర్షం, భయంకరమైన ఈదురు గాలులతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల ప్రజలు…
ఇట్లు అర్జున.. ఈ మధ్య టాలీవుడ్ చర్చనీయాంశం అవుతున్న చిన్న సినిమా. ఇందులో అనీష్ అనే కొత్త హీరో లీడ్…
భారతీయ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ మధ్య విదేశీ నిధుల వివాదం దుమారం రేపుతూనే వుంది. నీట్ పేపర్…