Movie News

RRRలో బాక్సింగ్ పంచులు అదిరిపోతాయ్

దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో ఫైట్స్‌కి ఉండే ఇంపార్టెంట్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ‘సింహాద్రి’ దగ్గర్నుంచి ‘విక్రమార్కుడు’, ‘మగధీర’, ‘బాహుబలి’ ఇలా ప్రతీ సినిమాలో అదిరిపోయే ఫైట్స్‌తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు జక్కన్న.

‘బాహుబలి’ అఖండ విజయంలో ఈ ఫైట్స్ పాత్ర చాలానే ఉంది. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫైట్స్ తెరకెక్కిస్తున్నారట రాజమౌళి అండ్ కో. మెయిన్ పాత్రలు అయిన సీతారామరాజు, కొమరం భీమ్‌ల కోసం బాక్సింగ్ పంచులు వాడుతున్నారట.

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రొఫెషనల్ బాక్సర్లు ఫైట్ సీక్వెన్స్‌కు కొరియోగ్రాఫ్ చేస్తున్నారట. భారత ప్రొఫెషనల్ బాక్సర్ కుల్దీప్ సింగ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘రాజమౌళితో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నా… రామ్ చరణ్, అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, అలియా భట్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం కొన్ని బాక్సింగ్ సీన్స్‌కు కొరియోగ్రఫీ చేశాను.

ఇది కూడా బాహుబలిగా మరో బ్లాక్‌బస్టర్ అవుతుంది’ అంటూ ట్వీట్ చేశాడు కుల్దీప్ సింగ్. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్‌లో చరణ్ బాక్సింగ్ స్టిల్స్‌ను చూపించాడు జక్కన్న. విల్లువిద్య, షూటింగ్, బాక్సింగ్ విద్యల్లో ఆరితేరిన సీతారామరాజు కోసం ఓ అదిరిపోయే బాక్సింగ్ ఫైట్ కంపోజ్ చేశారని, మెగా ఫ్యాన్స్‌‌కు ఇది ఓ స్పెషల్ ట్రీట్‌లా ఉంటుందని టాలీవుడ్ టాక్.

హాలీవుడ్ మూవీస్‌ను తలపించే రేంజ్‌లో ఫైట్స్‌ను రూపొందించే జక్కన్న, ‘ఆర్ఆర్ఆర్’తో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు. చెర్రీ బర్త్‌డేకి ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియో రిలీజ్ చేసిన ‘RRR’ టీమ్, మే20న ఎన్టీఆర్ పుట్టినరోజు సర్‌ప్రైజ్‌గా ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో రూపొందించే పనిలో బిజీగా ఉంది.

This post was last modified on May 6, 2020 1:06 pm

Share
Show comments
Published by
Satya
Tags: Ram Charan

Recent Posts

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

20 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

8 hours ago

ఒకవేళ కవిత సీఎం అయితే?

#AskKavitha- హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్ల నుంచి అభిప్రాయాలు సేక‌రించిన తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌.. ఇదే స‌మ‌యంలో ప‌లువురు నెటిజ‌న్లు…

8 hours ago