ముందే హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రకృతిని పూర్తిగా ఎదురుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం రాజమండ్రి, కాకినాడ కేంద్రంగా ముంచేస్తున్న అర్నబ్ తుఫాను జనాన్ని హడలెత్తిస్తోంది. అతలాకుతలం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా నివారిస్తున్నప్పటికీ, ఇంకో రెండు మూడు రోజులు దీని ప్రభావమైతే తీవ్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటోంది. వాయుగుండం త్వరగా తీరం దాటితే ఇబ్బంది లేదు. జనజీవనం యధాస్థితికి చేరుకుంటుంది.
ఇక్కడ టెన్షన్ పడాల్సిన విషయం ఏంటంటే ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త రిలీజులున్నాయి. ఆదర్శ కుటుంబం ఏకె 47 మీద బయ్యర్ వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. సీడెడ్ నైజామ్ లో పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఉత్తరాంధ్ర వైపు తుఫాను ఎఫెక్ట్ వల్ల కలెక్షన్లు ప్రభావితం చెందితే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం సమస్యవుతుంది. అసలే టికెట్ రేట్ల పెంపు తీసుకున్నారు. దాన్ని అమలు చేయడం కష్టమవుతుంది. వర్షం త్వరగా తెరిపినిస్తే బాగుంటుందని ఎగ్జిబిటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక విశ్వక్ సేన్ కల్ట్ కూడా ఇదే చిక్కు చవి చూడాల్సి ఉంటుంది. కాకపోతే బడ్జెట్ పరంగా వెంకటేష్ సినిమా కన్నా తక్కువది కాబట్టి డీసెంట్ గా వర్కౌట్ అయినా లాభాలు చూడొచ్చు. జైలర్ 2, రణబాలి థియేటర్ రన్ ఇంకో వారం కొనసాగేలా ఉంది. 418 కూడా బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. రామాయణ పార్ట్ 1 కన్నా ముందే ఇవి హ్యాపీగా సెలవు తీసుకోబోతున్నాయి. ఎటొచ్చి ఆదర్శ కుటుంబం, కల్ట్ లకు కొన్ని ఏరియాల్లో ఆక్యుపెన్సీల పరంగా కొంత ఆందోళన తప్పదు.
పైగా ఇప్పుడు దేన్నీ వాయిదా వేసే అవకాశం లేకుండా పోయింది. ఆదర్శ కుటుంబం ఇప్పటికే ఒకే నెలలో రెండు పోస్టుపోన్లు చేసుకుంది. దీని వల్ల ఇతర చిన్న మీడియం బడ్జెట్ సినిమాల ప్లానింగ్ దెబ్బ తింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సహా అన్ని ప్రమోషన్లు పూర్తయిపోయాయి కాబట్టి వెంకీ వెనుకడుగు వేసే ఛాన్స్ లేదు. విశ్వక్ కూడా నో కాంప్రోమైజ్ అంటున్నాడు. సో వరద తాకిడి త్వరగా తగ్గితే జనం కోలుకోవడంతో పాటు బాక్సాఫీస్ వేగం కూడా పుంజుకుంటుంది.
This post was last modified on October 27, 2026 10:49 pm
తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన ధనుష్.. ప్రయోగాల నుంచి కొంచెం పక్కకు వచ్చి ఈసారి పక్కా కమర్షియల్ సినిమానే చేస్తున్నట్లున్నాడు.…
తండేల్ తర్వాత ఏడాది గడిచినా నాగచైతన్య నుంచి కొత్త సినిమా రాలేదు. అభిమానులు ఎదురు చూసి చూసి నెలలు అయిపోయాయి…
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. ఈ ఇద్దరిలో ఎవరి సినిమా రిలీజైనా సోషల్ మీడియా హీటెక్కిపోవడం మామూలే. వాళ్లు చేసే…
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మంచి అంచనాల మధ్య కొన్ని నెలల ముందు హీరోగా అరంగేట్రం చేశాడు ఘట్టమనేని…
నాలుగు దశాబ్దాలకు పైగా నటప్రస్థానంలో దర్శకులు ఆర్ నారాయణమూర్తి ఏనాడూ తన బాటను వీడింది లేదు. సమాజానికి సందేశాన్ని ఇచ్చే…
అక్టోబర్ నెలాఖరు థియేటర్ ఆడియన్స్ కి రెండు ఛాయిసులున్నాయి. ఒకటి వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె 47 కాగా రెండోది…