Movie News

నాగవంశీ.. ఛాన్స్ మిస్సా.. ఎస్కేపా?

టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్లలో నాగవంశీ ఒకడు. సోషల్ మీడియాలో ఆయన గురించి జరిగినంత చర్చ ఇంకెవరి మీదా జరగదు అంటే అతిశయోక్తి కాదు. తాను ప్రొడ్యూస్ చేసిన లేదా డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలతో తరచుగా వార్తల్లో ఉంటాడు నాగవంశీ. డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన ఎంచుకునే సినిమాల మీద ప్రత్యేక ఆసక్తి ఉంటుంది ప్రేక్షకుల్లో. ఐతే గత ఏడాది కొన్ని తప్పటడుగుల వల్ల ఇటు ప్రొడక్షన్లో, అటు డిస్ట్రిబ్యూషన్లో దెబ్బ తిన్న నాగవంశీకి.. ఈ ఏడాది మెరుగైన ఫలితాలే వస్తున్నాయి.

ఫంకీ, ఎపిక్ లాంటి చిన్న సినిమాలు ఫెయిలైనా.. లెనిన్, విశ్వనాథ్ అండ్ సన్స్ మంచి విజయాలందుకున్నాయి. డిస్ట్రిబ్యూషన్లో డబ్బింగ్ మూవీ ‘జైలర్-2’ చాలా మంచి ఫలితాన్నందించింది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన ‘ది ప్యారడైజ్’ను కూడా నాగవంశీనే రిలీజ్ చేయాల్సింది. కానీ ఈ సినిమా రిపోర్ట్ గురించి ముందే హింట్ అందుకుని ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్లో వాటాను బాగా తగ్గించుకున్నట్లు ఓ ప్రచారం నడిచింది.

కట్ చేస్తే ఇప్పుడు ‘వృషకర్మ’ డిస్ట్రిబ్యూషన్ నుంచి కూడా అనూహ్యంగా తప్పుకున్నాడు నాగవంశీ. ముందు రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను హోల్ సేల్‌గా నాగవంశీ కొనేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దిల్ రాజు ఫ్యాన్సీ రేటు ఇచ్చి రైట్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. ఐతే రేటు ఎక్కువ పెట్టడం వల్ల రాజుకు ఛాన్స్ వచ్చిందా.. లేక నాగవంశీనే వద్దని తప్పుకున్నాడా అన్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అనిరుధ్ రవిచందర్ సూచనతోనే ‘జైలర్-2’కు ఫ్యాన్సీ రేటు ఇచ్చి నాగవంశీ రైట్స్ తీసుకున్నట్లుగా ఓ ప్రచారం నడిచింది ఇటీవల. అలాగే ఇన్ సైడ్ రిపోర్ట్స్ ఆధారంగానే ఆయన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటున్నాడని.. ‘వృషకర్మ’ గురించి ఏదో సమాచారం అందడం వల్లే డిస్ట్రిబ్యూషన్ నుంచి వైదొలిగాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా అని దిల్ రాజు అంత ఈజీగా ట్రాప్‌లో పడే రకమేమీ కాదు. ఆయన సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు చూసే రైట్స్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి ‘వృషకర్మ’ బాగా ఆడి నాగవంశీ చింతించేలా చేస్తుందా.. లేక ఆయన ఎస్కేప్ అయ్యాడనే ఫీలింగ్ కలిగిస్తుందా అన్నది చూడాలి.

This post was last modified on October 27, 2026 3:18 pm

Share

Recent Posts

చొక్కా మడతేసి మరీ జగన్ వార్నింగ్!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ లను కూటమి పార్టీల నేతలు, పోలీసులు, అధికారులు అడ్డుకుంటున్నారని…

1 hour ago

ఏబీవీకి మంచి మద్దతు

విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మేయ‌ర్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆలూరి బాల వెంక‌టే శ్వర‌రావు(ఏబీవీ)కు మాజీ…

3 hours ago

పాపం చంద్రబాబు చాలా తగ్గారు: పవన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదని వైసీపీ ప్రచారం…

4 hours ago

కంగనా రనౌత్ మళ్లీ తెలుగులో?

బాలీవుడ్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగులో ప్రభాస్ లాంటి పెద్ద హీరో సరసన ‘ఏక్ నిరంజన్’ సినిమా చేసింది…

5 hours ago

నాగ‌వంశీ ఫ్రెండు కాదు, ప్రొడ్యూసర్ మాత్రమే

ఒక హీరో, ఒక‌ నిర్మాత క‌లిసి సినిమా చేసే క్ర‌మంలో కొన్ని నెల‌లు, సంవ‌త్స‌రాలు క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. ఈ…

5 hours ago

మెగావర్స్… కొత్త అధ్యాయం ఎలా ఉంటుందో

మెగాస్టార్ చిరంజీవి మరోసారి బుల్లితెరపై మెరవబోతున్నారు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు యాంకర్ గా ఒక సీజన్ నడిపించిన సంగతి…

6 hours ago