Movie News

అప్డేట్ ఇచ్చి దొరికిపోయిన హీరో

‘కార్తికేయ-2’ మూవీతో అనుకోకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు యంగ్ హీరో నిఖిల్. ఈ ఫేమ్‌ను సరిగా ఉపయోగించుకుని ఉంటే.. తన రేంజే వేరుగా ఉండేది. కానీ దానికి ఫాలో అప్‌గా సరైన సినిమాలు చేయలేకపోయాడు. ‘18 పేజెస్’ ఓ మాదిరిగా ఆడింది. స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో డిజాస్టర్లయ్యాయి. ఈ స్థితిలో నిఖిల్ ఆశలన్నీ ‘స్వయంభు’ మీదే నిలిచాయి.

ఇది నిఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. చాలా భారీ కథతో తీర్చిదిద్దారు. టీజర్ చూస్తే ‘బాహుబలి’ లక్షణాలు కనిపించాయి. కానీ చాలా రోజుల కిందట టీజర్, ఒక సాంగ్‌తో ప్రేక్షకులను పలకరించి మాయమైన టీం.. ఇప్పటిదాకా ఏ అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేదు. విజువల్ ఎఫెక్ట్స్ మీద సుదీర్ఘ కాలంగా పని చేస్తున్నారు. కానీ అవి ఒక కొలిక్కి రావట్లేదు. సినిమా విడుదల ఎప్పుడో తేలట్లేదు. సోషల్ మీడియాలోనేమో నిఖిల్‌ను ట్యాగ్ చేసి ‘స్వయంభు’ రిలీజ్ గురించి ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు.

వాళ్లను ఎంగేజ్ చేద్దామని నిన్న ఒక పోస్టు పెట్టాడు నిఖిల్. తాజాగా తాను ‘స్వయంభు’కు సంబంధించి కొన్ని వీఎఫెక్స్ షాట్స్ చూశానని, అవి అద్భుతంగా ఉన్నాయని.. ఈ ఏడాది బిగ్ స్క్రీన్ మీద అద్భుతమైన అనుభవాన్ని చూడబోతున్నారని ఊరిస్తూ పోస్టు పెట్టాడు నిఖిల్. ఈ పోస్టుకు ఒక ఫొటో కూడా జోడించాడు. సముద్ర తీరంలో గుర్రం మీద ఉన్న నిఖిల్ ఫొటో అది. సినిమా నుంచి తీసిన స్టిల్ ఇదని అంతా అనుకున్నారు. ఐతే దీన్ని జూమ్ చేసి చూస్తే.. అసలు విషయం అర్థమైపోయింది. అది ఒరిజినల్ కాదు. ఏఐ జనరేటెడ్.

నిఖిల్ ఏ ఉద్దేశంతో ఈ ఫొటో షేర్ చేశాడో కానీ.. ఇది కాస్తా నెగెటివ్ అయింది. సినిమా గురించి అప్‌డేట్ ఇస్తూ ఒరిజినల్ ఫొటో పెట్టకుండా, ఏఐ జనరేటెడ్ పిక్ పెట్టడం ఏంటి.. ఇలా జనాలను ఎందుకు మభ్యపెడుతున్నావు అంటూ నిఖిల్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సినిమాలో కంటెంట్ కూడా ఇలాగే ఉంటుందా.. ఒరిజినాలిటీ చూపిస్తారా అంటూ కౌంటర్లు కూడా వేస్తున్నారు నెటిజన్లు. సినిమాకు హైప్ ఇద్దామని అప్‌డేట్ ఇస్తే.. ఇలా బూమరాంగ్ అవుతుందని నిఖిల్ ఊహించి ఉండడేమో పాపం. నెగిటివిటీ పెరగడం గ్రహించిన నిఖిల్ ఇప్పుడు ఆ పోస్టు డిలీట్ చేయడం గమనార్హం.

This post was last modified on October 26, 2026 12:41 pm

Share

Recent Posts

భజ గోవిందం… జనాలకు రీచ్ అయిపోయింది

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో సాహిత్యం వినిపించి, సంగీతం శ్రావ్యంగా అనిపించిన పాటలు ఎన్ని ఉన్నాయంటే వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు.…

20 minutes ago

‘కేజీఎఫ్’నే కొట్టేసిన చిన్న సినిమా

ప్రేమద ఊరలి.. గత నెల రోజులుగా కన్నడ నాట ఈ చిన్న సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు.…

55 minutes ago

ముసుగులో గుద్దులాట వద్దు విశ్వంభరా

నెలలు తరబడి సంవత్సరాలు దాటిపోయి మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. విఎఫ్ఎక్స్ వల్ల…

1 hour ago

విద్యుత్ తీగపై గుట్కా ఉమ్మి…

గుట్కా నమిలి బయటకు ఉమ్మడం ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. ఇంటి మూడో అంతస్తు బాల్కనీ నుంచి గుట్కా ఉమ్మగా,…

3 hours ago

బతికితే బాలయ్యలా బతకాలి

https://youtu.be/GBEMMz7D6C8?si=nOeiImX8VJI8Cl2H నందమూరి బాలకృష్ణతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట.. ఆయనది బిందాస్ జీవితం అని. దేని గురించీ…

4 hours ago

ఇది కదా అసలైన రాజకీయం అంటే

రాన్రాను రాజకీయాల్లో విద్వేష కల్చర్ పెరిగిపోతుంది. పూర్వం రోజుల్లో నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు విభేదాలు ఉండేవి. విధానాల పరంగా…

4 hours ago