Movie News

భజ గోవిందం… జనాలకు రీచ్ అయిపోయింది

గత కొన్నాళ్లుగా టాలీవుడ్ లో సాహిత్యం వినిపించి, సంగీతం శ్రావ్యంగా అనిపించిన పాటలు ఎన్ని ఉన్నాయంటే వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ప్యారడైజ్ లో ఆయా షేర్ లాంటివి ఎంత చార్ట్ బస్టర్ అయినా వాటి రీచ్ మాస్ ఆడియన్స్ వరకే పరిమితం. ఇంటిల్లిపాది వినేలా లేదా చక్కగా ఉదయాన్నే పెట్టుకుని పనులు చూసుకునేలా ఏదైనా సాంగ్ ఉందా అంటే ఓ పది సంవత్సరాల వెనక్కు వెళ్లాల్సి వస్తోంది. దర్శకుడికి సరైన టేస్ట్ ఉంటే ఇదేమంత బ్రహ్మపదార్ధం కాదనేది వాస్తవం.

ఇటీవలే రియాలిటీ సినిమా నుంచి భజ గోవిందం పాట విడుదలయ్యింది. జాతీయ అవార్డు గ్రహీత వైకోమ్ విజయలక్ష్మి గానం చేసిన ఈ సాంగ్ బాగా రీచ్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రోడ్ల అభివృద్ధిని హైలైట్ చేస్తూ ఒక వ్యక్తి వీడియో చేసి దానికి బ్యాక్ గ్రౌండ్ లో భజ గోవిందంని పెట్టారు. ఇది ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు షేర్ చేసేదాకా వెళ్ళిపోయింది. ఏదో మాములు పాట అయితే ఇంత ప్రత్యేక ఫోకస్ వచ్చేది కాదు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఎంకంపోజింగ్ చక్కగా ఉంది.

జీవిత సారాన్ని చెబుతూ సనారే సాహిత్యం సమకూర్చిన ఈ పాట 2026 బెస్ట్ లో ఒకటిగా నిలుస్తుందని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. తక్కువ నయసులోనే దర్శకుడిగా మెగా ఫోన్ చేపట్టిన కిరణ్ అబ్బవరం మ్యూజిక్ విషయంలోనూ ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడో ఈ సాంగ్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఆల్బమ్ ఇలాగే ఉంటుందని ఇన్ సైడ్ టాక్. మధ్యతగతి జీవితాలను సహజంగా చూపిస్తూనే ఎమోషన్లకు పెద్ద పీఠ వేసిన సైనం విజువల్స్ లో కనిపిస్తోంది

డిసెంబర్ 25 విడుదల కాబోతున్న రియాలిటీ నాగార్జున కింగ్ 100, బాలకృష్ణ దాదా, షారుఖ్ ఖాన్ కింగ్ తో పాటుగా థియేటర్లలో అడుగు పెట్టనుంది. కనీసం ఒక్కటైనా దీంట్లోవాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే కిరణ్ కు మంచి ఛాన్స్ దొరికినట్టే. చెన్నై లవ్ స్టోరీ హిట్టయినా కిరణ్ కోరుకుంటున్న పెద్ద రేంజ్ ఇంకా రాలేదు. సాలిడ్ బ్లాక్ బస్టర్ ఒకటి పడితే కెరీర్ పురుగులు పెడుతుంది. దేవిక భట్ హీరోయిన్ గా నటిస్తున్న రియాలిటీలో సాయికుమార్, శరత్ కుమార్ సహా కీలక క్యాస్టింగ్ ఉన్నారు.

This post was last modified on October 26, 2026 12:25 pm

Share

Recent Posts

‘కేజీఎఫ్’నే కొట్టేసిన చిన్న సినిమా

ప్రేమద ఊరలి.. గత నెల రోజులుగా కన్నడ నాట ఈ చిన్న సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు.…

37 minutes ago

ముసుగులో గుద్దులాట వద్దు విశ్వంభరా

నెలలు తరబడి సంవత్సరాలు దాటిపోయి మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర టాపిక్ మళ్ళీ తెరపైకి వచ్చింది. విఎఫ్ఎక్స్ వల్ల…

49 minutes ago

విద్యుత్ తీగపై గుట్కా ఉమ్మి…

గుట్కా నమిలి బయటకు ఉమ్మడం ఓ వృద్ధుడి ప్రాణాలు తీసింది. ఇంటి మూడో అంతస్తు బాల్కనీ నుంచి గుట్కా ఉమ్మగా,…

3 hours ago

బతికితే బాలయ్యలా బతకాలి

https://youtu.be/GBEMMz7D6C8?si=nOeiImX8VJI8Cl2H నందమూరి బాలకృష్ణతో సాన్నిహిత్యం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట.. ఆయనది బిందాస్ జీవితం అని. దేని గురించీ…

4 hours ago

ఇది కదా అసలైన రాజకీయం అంటే

రాన్రాను రాజకీయాల్లో విద్వేష కల్చర్ పెరిగిపోతుంది. పూర్వం రోజుల్లో నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు విభేదాలు ఉండేవి. విధానాల పరంగా…

4 hours ago

శ్రీలీల నుంచి లాగేసుకున్న కాయదు?

పుట్టి పెరిగింది కర్ణాటకలో అయినా.. సినిమాల్లో రంగప్రవేశం చేసింది కూడా కన్నడ ఇండస్ట్రీలోనే అయినా.. శ్రీలీల అచ్చమైన తెలుగమ్మాయే. ‘పెళ్ళిసంద-డి’…

10 hours ago