ఒకప్పుడు హీరోలకు షూటింగ్ లేని టైంలో వాళ్ళను కలుసుకునేందుకు అభిమానులు నేరుగా ఇళ్ల వద్దకు వెళ్ళేవాళ్ళు. స్టార్లు కూడా విసుక్కోకుండా కాసేపు మాట్లాడి వీలైతే ఫోటోలు కూడా ఇవ్వడం అప్పట్లో మాములే. కానీ ఇప్పుడలా సాధ్యపడటం లేదు. సెలబ్రిటీ వర్షిప్ లో మునిగి తేలుతున్న యువతకు హీరోలతో స్నాప్ తీసుకోవడం పెద్ద అచీవ్ మెంట్ అయిపోయింది. సరే ఆ అభిమానాన్ని తక్కువ చేసి చూడలేం కానీ కొత్త రిలీజులు ఉన్నప్పుడు హీరోలు ప్రత్యేకంగా ఫోటో షూట్లు చేయడం మాములే.
ఒక వేదికని నిర్ణయించుకుని, ఫ్యాన్స్ ని అక్కడికి పిలిపించి, ఒక్కొక్కరిని స్టేజి మీద తీసుకొచ్చి ఫోటో దిగేసి, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఒక డ్రైవ్ లింక్ లో అవన్నీ అప్లోడ్ చేసి అందరికీ షేర్ చేయడం రివాజుగా మారిపోయింది. నాని, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఇలా పెద్ద లిస్టు ఉంది. తాజాగా విశ్వక్ సేన్ ఇందులో తోడయ్యాడు. ఇవాళ హైదరాబాద్ లో ప్లాన్ చేసిన ఫోటో సెషన్ కి అభిమానులు విపరీతంగా రావడంతో కొందరు అభిమానులు ఫోటోలు తీసుకున్న తర్వాత రద్దీని కంట్రోల్ చేయలేక నిర్వాహకులు హఠాత్తుగా క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది.
ఇంతకన్నా భారీ సంఖ్యలో వచ్చినప్పుడు ఇతర హీరోలు మేనేజ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ విశ్వక్ సేన్ విషయంలో ఎక్కడో ప్లానింగ్ మిస్సయినట్టుగా కనిపిస్తోంది. బహుశా గ్రౌండ్ లెవెల్ లో ఇంత ఫాలోయింగ్ ఉందని ఊహించలేదేమో. అక్టోబర్ 30 విడుదల కాబోతున్న కల్ట్ ప్రమోషన్లలో భాగంగా విశ్వక్ సేన్ దీన్ని సెట్ చేసుకున్నాడు. కానీ అనుకోకుండా వచ్చిన తాకిడి వల్ల అంతమందిని నిరుత్సాహ పరచడం వ్యక్తిగతంగా తనకూ లోటు అనిపించే విషయం.
రేపో ఎల్లుండో మళ్ళీ చేయొచ్చేమో కానీ మొదటిసారి వచ్చిన ఫ్యాన్స్ కి మాత్రం ఇది నిరాశ కలిగించే విషయమే. ఆదర్శ కుటుంబంతో పోటీ పడుతున్న కల్ట్ మీద విశ్వక్ సేన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వయొలెన్స్ ఎంత ఎక్కువ ఉన్నా సరే ఆడియన్స్ ని మెప్పించి తీరుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. తెలుగులో తొలి స్లాషర్ థ్రిల్లర్ గా చెప్పుకుంటున్న కల్ట్ కనక వర్కౌట్ అయితే ఇతర బాషల డబ్బింగ్, రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ వస్తుంది. కంటెంట్ లో అంత హింస ఉంది మరి.
This post was last modified on October 25, 2026 4:28 pm
పదేళ్ల కిందట ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియా అంతటా విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు మలయాళ నటుడు నివిన్ పౌలీ. ఆ…
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతా బాగుందన్న ఫీలింగ్ ఆయా పార్టీల్లో పైకే కనిపిస్తోంది. అంతర్గతంగా చూస్తే..…
ఫ్యామిలీ మ్యాన్ పుణ్యమాని ఓటిటి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరిగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ కొత్త…
తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన సునీల్ బన్సల్ .. తొలి పర్యటనలోనే నేతలను లైన్‌లో పెట్టే చర్యల దిశగా…
ఇండియన్ హిస్టరిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రచారం జరుపుకున్న రామాయణ పార్ట్ 1 ఇంకో పది రోజుల్లో విడుదల…
ఇటీవలే విడుదలైన హారర్ మూవీ 418 బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. టాక్ మరీ యునానిమస్ గా రాకపోయినా…