Movie News

హిట్ట‌యితే వంద‌లు… ఫ్లాప్ అయితే ఒక‌ట్లు

ప‌దేళ్ల కింద‌ట ప్రేమమ్ సినిమాతో సౌత్ ఇండియా అంత‌టా విప‌రీత‌మైన పాపులారిటీ సంపాదించాడు మ‌ల‌యాళ న‌టుడు నివిన్ పౌలీ. ఆ త‌ర్వాత కూడా అడ‌పాదడ‌పా కొన్ని హిట్లు కొట్టాడు. కానీ ఆపై వ‌రుస‌గా కొన్నేళ్ల పాటు ఫ్లాపుల మీద ఫ్లాపులు ఎదుర‌వ‌డంతో రేసులో బాగా వెనుక‌బ‌డిపోయాడు. టొవినో థామ‌స్ స‌హా యంగ్ హీరోల జోరులో నివిన్ మ‌రుగున ప‌డిపోయాడు.

ఇక మ‌ళ్లీ అత‌ను పుంజుకోవ‌డం క‌ష్ట‌మే అని అంతా తేల్చేశారు. కానీ అనూహ్యంగా గ‌త ఏడాది స‌ర్వం మాయ సినిమాతో బ‌లంగా త‌న పున‌రాగ‌మ‌నాన్ని ఘ‌నంగా చాటాడు నివిన్. పెద్ద‌గా అంచ‌నాలు లేకుండా రిలీజైన ఆ చిత్రం.. ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుని రూ.150 కోట్ల క్ల‌బ్బులో అడుగుపెట్టింది. చాలా ఏళ్లు హిట్టు లేక ప్రేక్ష‌కుల దృష్టి నుంచి ప‌క్కకు వెళ్లిపోయిన హీరో ఈ రేంజ్ హిట్ కొట్ట‌డం ట్రేడ్‌కు పెద్ద షాకే.

ఐతే నివిన్ నుంచి త‌ర్వాత వ‌చ్చిన సినిమా ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో డిజాస్ట‌ర్ అయింది. ఆ చిత్ర‌మే.. బేబీ గ‌ర్ల్. ఈ మూవీ కేవ‌లం 4.6 కోట్ల వ‌సూళ్లు మాత్ర‌మే రాబ‌ట్టింది. అంత పెద్ద హిట్ త‌ర్వాత నివిన్ నుంచే వ‌చ్చిన సినిమాకు మినిమం ఓపెనింగ్స్ కూడా లేక‌పోవ‌డం షాకింగే.

ఇదే కాదు.. ప్ర‌తిచాయ పేరుతో నివిన్ నుంచి వ‌చ్చిన మ‌రో సినిమా కూడా ఇలాంటి ఫ‌లితాన్నే అందుకుంది. ఆ సినిమా కూడా సింగిల్ డిజిట‌ల్ క‌లెక్ష‌న్‌కు ప‌రిమిత‌మైంది. రూ.9 కోట్ల లోపే వ‌సూళ్లు రాబ‌ట్టింది. కానీ కొన్ని నెల‌ల ముందు విడుద‌లైన బెత్లెహాం కుడుంబ యూనిట్ మాత్రం ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయికి వెళ్లిపోయింది. రూ.331 కోట్ల‌తో మల‌యాళంలో కొత్త ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఐతే ఈ సినిమా త‌ర్వాత లేటెస్ట్‌గా నివిన్ నుంచి యేళు కాద‌ల్ యేళు మ‌లై పేరుతో ఓ సినిమా వ‌చ్చింది. ఈ సినిమా కేవ‌లం మూడు కోట్ల‌కు కాస్త ఎక్కువగా వ‌సూళ్లు రాబ‌ట్టిందంతే. ఇండ‌స్ట్రీ హిట్ త‌ర్వాత ఈ వ‌సూళ్లు విస్మ‌యం క‌లిగించేవే. నివిన్ సినిమాలు హిట్ట‌యితే వంద‌ల కోట్లు కొల్ల‌గొడుతుండ‌డం.. ఫ్లాప్ అయితే మ‌రీ సింగిల్ డిజిట్‌కు ప‌డిపోతుండ‌డంతో త‌న స్టార్ ఇమేజ్‌ను ప్ర‌శ్నార్థ‌కం చేస్తోంది. ఇంత వైరుధ్యం చాలా అరుద‌నే చెప్పాలి.

This post was last modified on October 25, 2026 2:07 pm

Share

Recent Posts

నేత‌ల వైఖ‌రితో చంద్ర‌బాబు.. జ‌గ‌న్ వైఖ‌రితో నేత‌లు..

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అంతా బాగుంద‌న్న ఫీలింగ్ ఆయా పార్టీల్లో పైకే క‌నిపిస్తోంది. అంత‌ర్గ‌తంగా చూస్తే..…

2 hours ago

బిల్డప్ ఇచ్చిన సినిమాకు టాక్ ఏంటి

ఫ్యామిలీ మ్యాన్ పుణ్యమాని ఓటిటి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకరిగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ కొత్త…

4 hours ago

తెలంగాణ బీజేపీకి కరెక్ట్ ఇంచార్జి దొరికినట్టేనా?

తెలంగాణ బీజేపీ ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సునీల్ బన్సల్ .. తొలి ప‌ర్య‌ట‌న‌లోనే నేత‌ల‌ను లైన్‌లో పెట్టే చ‌ర్య‌ల దిశ‌గా…

5 hours ago

రామాయణకు ఇప్పుడున్న ఊపు సరిపోతుందా

ఇండియన్ హిస్టరిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రచారం జరుపుకున్న రామాయణ పార్ట్ 1 ఇంకో పది రోజుల్లో విడుదల…

10 hours ago

దెయ్యం సినిమాతో బ్రేక్ అందుకున్న దేవిక

ఇటీవలే విడుదలైన హారర్ మూవీ 418 బాక్సాఫీస్ వద్ద డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తోంది. టాక్ మరీ యునానిమస్ గా రాకపోయినా…

14 hours ago

పునేఠా పార‌ద‌ర్శ‌క‌త‌కు ఇదే నిద‌ర్శ‌నం జ‌గ‌న్‌

ఏపీలో జ‌రుగుతున్న స్థానిక‌, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ అనిల్ చంద్ర…

15 hours ago